Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు: టాప్-5 ప్లేయ‌ర్లు వీరే

Published : Feb 27, 2025, 12:06 PM ISTUpdated : Feb 27, 2025, 12:23 PM IST

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఇంగ్లాండ్‌పై అద్భుతంగా రాణించి ఆఫ్ఘనిస్తాన్ త‌న తొలి విజ‌యాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ యంగ్ ప్లేయ‌ర్ ఇబ్ర‌హీం జ‌ద్రాన్ సూప‌ర్ సెంచ‌రీతో ఛాంపియన్స్ ట్రోఫీలో అత్య‌ధిక వ్యక్తిగత ప‌రుగులు చేసిన‌ బెన్ డ‌కెట్ రికార్డును బ్రేక్ చేశాడు.   

PREV
14
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు: టాప్-5 ప్లేయ‌ర్లు వీరే

highest score in Champions Trophy: బుధవారం లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో ఇంగ్లాండ్‌పై ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన ఇబ్రహీం జద్రాన్ చరిత్ర సృష్టించాడు. త‌న సునామీ సెంచ‌రీలో ఈ యంగ్ ప్లేయ‌ర్ లెజెండ‌రీ క్రికెట‌ర్ల రికార్డులు బ‌ద్ద‌లు కొట్టాడు.

ఛాంపియన్స్ ట్రోఫీలో ఆఫ్ఘనిస్తాన్ తరపున సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా నిలిచిన ఇబ్ర‌హీం జద్రాన్ 146 బంతుల్లో 177 పరుగుల ఇన్నింగ్స్ లో 12 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు. తన ఈ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆఫ్ఘనిస్తాన్ 50 ఓవర్లలో 325/7 పరుగులు చేసింది. తర్వాత భారీ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు 317 పరుగులు చేసి 8 పరుగుల తేడాతో ఓడిపోయింది.

24
highest individual scores in champions trophy: sourav ganguly to ibrahim zadran, these are the top 5 player

ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు: టాప్-5 ప్లేయ‌ర్లు 

ఈ మ్యాచ్ లో ఇబ్ర‌హీం జ‌ద్రాన్ 177 ప‌రుగుల ఇన్నింగ్స్ లో ఛాంపియ‌న్స్ ట్రోఫీలో అత్య‌ధిక వ్యక్తిగ‌త ఇన్నింగ్స్ ప‌రుగులు సాధించిన ప్లేయ‌ర్ గా ఘ‌న‌త సాధించాడు. ఈ క్ర‌మంలోనే బెన్ డకెట్ తో పాటు లెజెండ‌రీ ప్లేయ‌ర్ల రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టాడు. 

1. ఇబ్ర‌హీం జ‌ద్రాన్ - 177 ప‌రుగులు vs ఇంగ్లాండ్ (2025)
2. బెన్ డకెట్    - 165 ప‌రుగులు vs ఆస్ట్రేలియా (2025)
3. నాథన్ ఆస్టిల్ - 145* ప‌రుగులు vs యూఎస్ఏ (2004)
4. ఆండీ ఫ్లవర్ - 145 పరుగులు vs ఇండియా (2002)
5. సౌరవ్ గంగూలీ - 141* పరుగులు vs దక్షిణాఫ్రికా (2000)

6. సచిన్ టెండూల్కర్ - 141 పరుగులు (1998)

34

ఎవ‌రీ ఇబ్ర‌హీం జ‌ద్రాన్?  

23 ఏళ్ల ఈ ఆఫ్ఘనిస్తాన్ యంగ్ ప్లేయ‌ర్ ఇబ్ర‌హీం జ‌ద్రాన్ అంతర్జాతీయ క్రికెట్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న ప్రతిభావంతుడైన క్రికెటర్. అత‌ను 35 వన్డే మ్యాచ్‌ల్లో ఆరు సెంచరీలు సాధించాడు. అత‌ని సగటు 50 కంటే ఎక్కువగా ఉంది. ఈ ఫార్మాట్‌లో అత్యంత వేగంగా 1,000 పరుగులు చేసిన ఆఫ్ఘన్ ప్లేయ‌ర్ కూడా అత‌నే. 

ఇబ్ర‌హీం జద్రాన్ డిసెంబర్ 12, 2001న ఆఫ్ఘనిస్తాన్‌లోని కాబూల్‌లో జన్మించాడు. చిన్న వయసులోనే కాబూల్ వీధుల్లో ఆడేటప్పుడు అతనికి క్రికెట్ పట్ల ప్రేమ మొదలైంది. త‌క్కువ కాలంలోనే కోచ్‌లు, సెలెక్టర్లు దృష్టిలో ప‌డ‌టంతో జాతీయ జ‌ట్టులోకి వ‌చ్చాడు.

44

కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ అయిన ఇబ్ర‌హీం జ‌ద్రాన్ 2017లో ఆఫ్ఘనిస్తాన్ అండర్-19 జట్టు తరపున అరంగేట్రం చేశాడు. తన అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యంలో మ‌రింత గుర్తింపు సాధించాడు. త‌క్కువ స‌మ‌యంలో ఆఫ్ఘనిస్తాన్ జాతీయ సీనియర్ జట్టులోకి వ‌చ్చాడు. 2019లో అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. 

2021లో జింబాబ్వేపై జరిగిన వన్డేలో జద్రాన్ సెంచరీ చేయడం త‌న కెరీర్ ను మ‌లుపుతిప్పింది. అప్పటి నుండి అతను ఆఫ్ఘన్ క్రికెట్ జట్టులో రెగ్యుల‌ర్ ప్లేయ‌ర్ గా మారాడు. ఆ త‌ర్వాతి సంవ‌త్స‌రం అంటే 2022లో ICC ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా కూడా ఇబ్ర‌హీం జ‌ద్రాన్ ఎంపికయ్యాడు.

Read more Photos on
click me!

Recommended Stories