ధోనీ నుంచి సీఎస్‌కే జెర్సీ, కోహ్లీ నుంచి టీమిండియా జెర్సీ... పాక్ క్రికెటర్ హరీస్ రౌఫ్‌కి...

First Published Aug 30, 2022, 6:02 PM IST

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. పొరుగుదేశం పాకిస్తాన్ నుంచి విరాట్ కోహ్లీని చూడడానికి, కలవడానికే దుబాయ్‌కి వచ్చారు చాలామంది క్రికెట్ ఫ్యాన్స్. ఇండియా - పాక్ మ్యాచ్ జరుగుతున్న సమయంలోనూ కోహ్లీ జెర్సీలో కొందరు పాక్ క్రికెట్ ఫ్యాన్స్ కనిపించి స్టేడియంలో హడావుడి చేశారు. పాక్ క్రికెట్ టీమ్‌లో కూడా విరాట్ కోహ్లీకి వీరాభిమానులు ఉన్నారు...

virat

పాక్ ప్రస్తుత కెప్టెన్ బాబర్ ఆజమ్‌తో పాటు వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్, ఫకార్ జమాన్ వంటి క్రికెటర్లు కూడా విరాట్ కోహ్లీకి వీరాభిమానులు. ఈ విషయాన్ని వాళ్లు చాలాసార్లు స్వయంగా ప్రకటించారు కూడా. 

Virat Kohli-Harris Rauf

తాజాగా పాక్ బౌలర్ హరీస్ రౌఫ్, విరాట్‌పై తన అభిమానాన్ని చాటుకున్నారు. ఆసియా కప్ 2022 టోర్నీలో టీమిండియాతో మ్యాచ్ ముగిసిన అనంతరం పాక్ బౌలర్ హరీస్ రౌఫ్, విరాట్ దగ్గరికి వెళ్లి కాసేపు మాట్లాడాడు....

Latest Videos


Virat Kohli

కొద్దిసేపటి తర్వాత హరీస్ రౌఫ్‌కి ఆటోగ్రాఫ్ చేసిన తన టీమిండియా జెర్సీని కానుకగా అందించాడు విరాట్ కోహ్లీ. ఈ వీడియోను ఐసీసీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అయితే ఈ వీడియో వైరల్ కావడంతో ఎంఎస్ ధోనీ పేరు వార్తల్లోకి వచ్చింది...

దీనికి కారణం ఉంది. ఇంతకుముందు టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో టీమిండియాపై తొలిసారి విజయాన్ని అందుకుంది పాకిస్తాన్. ఈ మ్యాచ్ అనంతరం టీమిండియాకి మెంటర్‌గా వ్యవహరించిన ఎంఎస్ ధోనీని కలిసిన హరీస్ రౌఫ్, ఆ సమయంలో మాహీని జెర్సీని కానుకగా ఇవ్వాలని కోరాడు..

Haris Rauf Dhoni

అయితే టీమిండియా జెర్సీ కాకుండా సీఎస్‌కే జెర్సీ కావాలని కోరాడు హరీస్ రౌఫ్. మాహీ కూడా హరీస్ రౌఫ్ కోరినట్టుగానే చెన్నై జర్సీని పాక్ బౌలర్‌కి కానుకగా పంపాడు. ధోనీ పంపిన జెర్సీని అందుకున్న హరీస్ రౌఫ్, సోషల్ మీడియా ద్వారా తన సంతోషం వ్యక్తం చేశాడు...

virat kohli

అప్పుడు ధోనీ నుంచి సీఎస్‌కే జెర్సీ తీసుకున్న హరీస్ రౌఫ్, ఇప్పుడు విరాట్ కోహ్లీ నుంచి టీమిండియా జెర్సీ తీసుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. భారత క్రికెటర్లకు పాక్ బౌలర్ ఇలా అభిమానిగా మారడం పక్కనబెడితే... ధోనీ నుంచి ఐపీఎల్ జెర్సీ తీసుకుని, విరాట్ నుంచి టీమిండియా జెర్సీని తీసుకోవడమే హైలైట్‌గా మారింది...  

click me!