భువీ, చాహార్‌లను జట్టులో ఇరికించడం కష్టమే... విరాట్ కోహ్లీ ప్లేస్‌కి శ్రేయాస్ అయ్యర్‌ రూపంలో...

Published : Mar 01, 2022, 12:52 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు స్వదేశంలో వరుసగా సిరీస్‌లు ఆడుతోంది భారత జట్టు. న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంకపై టీ20 సిరీస్‌లను క్లీన్ స్వీప్ చేసిన రోహిత్ సేన, టీ20ల్లో నెం.1 ర్యాంకును దక్కించుకుంది...  

PREV
112
భువీ, చాహార్‌లను జట్టులో ఇరికించడం కష్టమే... విరాట్ కోహ్లీ ప్లేస్‌కి శ్రేయాస్ అయ్యర్‌ రూపంలో...

వెస్టిండీస్, శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌ల ద్వారా తుదిజట్టులో చోటు కోసం పోటీపడే ప్లేయర్ల సంఖ్య మరింతగా పెరిగిపోయింది...

212

సూర్యకుమార్ యాదవ్ ఎంట్రీ ఇచ్చిన సిరీస్‌లోనే, శ్రేయాస్ అయ్యర్ గాయపడి నాలుగు నెలల పాటు క్రికెట్‌కి దూరం కావడతో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో భారత జట్టు కూర్పు విషయంలో పెద్దగా ఇబ్బంది పడలేదు...

312

అయితే ఇప్పుడు సీన్ మారింది. సూర్యకుమార్ యాదవ్, వెస్టిండీస్‌తో సిరీస్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ గెలిస్తే, ఆ తర్వాత లంకతో టీ20 సిరీస్‌లో శ్రేయాస్ అయ్యర్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ గెలిచాడు...

412

ఇప్పుడు ఈ ఇద్దరూ నాలుగో స్థానం కోసం పోటీపడబోతున్నారు. వీరితో పాటు భారత మాజీ పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఫామ్‌లోకి రావడంతో పాటు దీపక్ చాహార్ కూడా అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు...

512

‘టీ20ల్లో భారత పేస్ బౌలింగ్ విభాగం అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. టీ20 వరల్డ్ కప్‌కి జట్టుకి ఎంపిక చేసే సెలక్షన్ ప్యానెల్‌లో నేను ఉంటే... భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహార్‌లకు చోటు ఇవ్వడం కష్టమే..

612

ఎందుకంటే వారి కంటే మహ్మద్ సిరాజ్, ఆవేశ్ ఖాన్, హర్షల్ పటేల్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు... వారికి అవకాశం ఇవ్వడమే కరెక్ట్...
 

712

స్పిన్ బౌలింగ్‌ విషయంలోనూ టీమిండియా బలంగా ఉంది. టాప్ 2 బ్యాటింగ్ ఆర్డర్ తర్వాత వచ్చే బ్యాటర్లు... భారీ షాట్లు ఆడుతూ, స్కోరు బోర్డును పరుగులు పెట్టించగలరు...

812

వెంకటేశ్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్... ఇరగదీస్తున్నారు. రోహిత్ శర్మకు ఈ విషయంలో చాలా పెద్ద తలనొప్పి తప్పదనే అనుకుంటున్నా...

912

మూడో స్థానంలో విరాట్ కోహ్లీ కంటే శ్రేయాస్ అయ్యర్ బెటర్ అని నా ఉద్దేశం. కావాలంటే విరాట్ కోహ్లీని రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ పంపొచ్చు...
 

1012

డెత్ ఓవర్లలో బౌలింగ్ చేసే పేసర్లు, మిడిల్ ఓవర్లలో బౌలింగ్ చేసే స్పిన్నర్ల ఎంపిక చాలా కీలకం. కుల్దీప్ యాదవ్, జడేజా... మంచి క్వాలిటీ స్పిన్ బౌలర్లు...

1112

అయితే ప్రెషర్ పరిస్థితుల్లో కుల్దీప్ యాదవ్, జడేజా భారీగా పరుగులు ఇచ్చేస్తారు. జడేజా కూడా వేగంగా బంతులు వేసి, ఈజీగా బౌండరీలు సమర్పిస్తారు... 

1212

అయితే వారి వద్ద రవి భిష్ణోయ్, యజ్వేంద్ర చాహాల్, అశ్విన్ రూపంలో చాలామంది స్పిన్నర్లు ఉన్నారు. ఈసారి టీ20 వరల్డ్‌ కప్ టోర్నీలో టీమిండియానే ఫెవరెట్’ అంటూ చెప్పుకొచ్చాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్...

click me!

Recommended Stories