అప్పుడు కోహ్లీకి పెళ్లి ప్రపోజల్... ఇప్పుడు మధ్య వేలు చూపిస్తూ షాకింగ్ ఫోటోతో ఎంగేజ్‌మెంట్...

Published : Mar 03, 2023, 10:15 AM IST

2014లో విరాట్ కోహ్లీకి మ్యారేజ్ ప్రపోజల్ చేసిన ఇంగ్లాండ్ క్రికెటర్ డేనియల్ వ్యాట్... సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్‌తో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు.. 9 ఏళ్ల తర్వాత తన పార్టనర్‌ని పరిచయం చేస్తూ షాకింగ్ ఫోటో... 

PREV
17
అప్పుడు కోహ్లీకి పెళ్లి ప్రపోజల్... ఇప్పుడు మధ్య వేలు చూపిస్తూ షాకింగ్ ఫోటోతో ఎంగేజ్‌మెంట్...

ఉమెన్స్ క్రికెట్‌లో స్వలింగ సంపర్కుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇప్పటికీ సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా టీమ్స్‌లో లెస్బియన్ జంటలు ఉన్నాయి. తాజాగా ఇంగ్లాండ్ మహిళా క్రికెట్ టీమ్ ఓపెనియర్ డేనియల్ వ్యాట్, మరో మహిళతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్టు షాకింగ్ ఫోటోతో ప్రకటించింది...
 

27

విరాట్ కోహ్లీ బీభత్సమైన ఫామ్‌లో ఉన్నప్పుడు 2014లో విరాట్ కోహ్లీకి సోషల్ మీడియా ద్వారా మ్యారేజ్ ప్రపోజ్ చేసింది డేనియల్ వ్యాట్. ‘కోహ్లీ మ్యారీ మీ!!!’ అంటూ ట్వీట్ చేసింది డేనియల్ వ్యాట్..

37

అయితే విరాట్ కోహ్లీ మాత్రం ఈ ట్వీట్‌కి స్పందించలేదు. అప్పటికీ బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మతో ఢేటింగ్‌లో ఉన్న విరాట్, వ్యాట్ ఓపెన్ ప్రపోజల్‌ని పట్టించుకోలేదు. 

47

అయితే డేనియల్, భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్‌తో డేటింగ్‌లో ఉందని కూడా వార్తలు వచ్చాయి... దీనికి కారణం అర్జున్ టెండూల్కర్‌, డేనియల్ వ్యాట్ చనువుగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడమే. 

57

అయితే ఈ ఇద్దరూ లండన్‌లో క్రికెట్ కోచింగ్ సమయంలో ఏర్పడిన స్నేహం కారణంగానే ఈ విధంగానే ఫోటోలు దిగినట్టు తేలింది.. అదీకాకుండా అర్జున్ టెండూల్కర్‌కీ, డానియల్ వ్యాట్‌కీ మధ్య చాలా వయసు తేడా ఉంది..

67

తాజాగా ఇంగ్లాండ్ ఉమెన్స్ ఫుట్‌బాల్ కెప్టెన్ జార్జియా హోడ్జేతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న డేనియల్  వ్యాట్... మధ్య వేలికి ఉన్న రింగ్‌ని చూపిస్తూ లిప్ లాక్ చేసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది... 
 

77
Danielle Wyatt

‘మైన్ ఫరెవర్’ అని కాప్షన్ ఇచ్చిన డేనియల్ వ్యాట్, ట్రోలర్స్‌కి, హేటర్స్‌కి మధ్య వేలు చూపిస్తున్నట్టుగా సెన్సేషనల్ ఫోటోని పోస్ట్ చేసింది.. 

Read more Photos on
click me!

Recommended Stories