క్రికెట్ ప్రపంచంలో 100 సెంచరీలు బాదిన ఏకైక లెజెండరీ బ్యాటర్ సచిన్ టెండూల్కర్. 2 దశాబ్దాలకు పైగా సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌ని కొనసాగించిన సచిన్ టెండూల్కర్, టెస్టుల్లో 200 మ్యాచులు, 15 వేలకు పైగా పరుగులు చేసిన ఏకైక బ్యాటర్‌గా ఉన్నాడు...
సచిన్ టెండూల్కర్ ఆటను చూసిన తర్వాత విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ వంటి ఎందరో కుర్రాళ్లు, ఆటను సీరియస్‌గా తీసుకుని క్రికెట్‌లోకి వచ్చారు. తాజాగా భారత సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్, సచిన్ టెండూల్కర్ గురించి కొన్న వ్యాఖ్యలు చేశాడు...
27
Sachin Tendulkar
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ తర్వాత కామెంటేటర్‌గా మారిన దినేశ్ కార్తీక్, ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టుకి కామెంటరీ చెబుతున్నాడు.. మూడో రోజు ఆటలో దినేశ్ కార్తీక్, సచిన్ గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
37
‘1998లో నా చిన్నప్పుడు మా నాన్న నన్ను, ఓ టెస్టు మ్యాచ్ చూపించేందుకు స్టేడియానికి తీసుకెళ్లారు. అది ఇండియా, ఆస్ట్రేలియా మధ్య టెస్టు మ్యాచ్. ఆ వయసులో నాకు ఒకే ఒక్క క్రికెటర్ తెలుసు... ఆయనే సచిన్ టెండూల్కర్...
47
నా పక్కనే కూర్చొన్న ఓ వ్యక్తి, సచిన్ టెండూల్కర్ గురించి కొన్ని మాటలు చెప్పాడు... ‘‘సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్‌ని నువ్వు బాగా ఎంజాయ్ చేస్తావ్. కానీ ఆయన వికెట్ల మధ్య చాలా వేగంగా పరుగెడుతాడనే విషయం మాత్రం మరిచిపోకు..
57
S Sreesanth and Sachin Tendulkar
ఛీజ్ కోసం చిట్టెలుక ఎలా పరుగెడుతుందో సచిన్ టెండూల్కర్ అలాగే వికెట్ల మధ్య పరుగెడతాడు. అందుకే అతన్ని అవుట్ చేయడం అంత తేలికైన విషయం కాదు...’’ అన్నాడు. ఆ మాటలు నాకు ఇంకా కొద్దికొద్దిగా గుర్తున్నాయి...
67
సచిన్ ఆ మ్యాచ్‌లో 155 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌ని నేను ఎప్పటికీ మరిచిపోలేను. ఆ ఇన్నింగ్స్‌లో ఎన్నో సిక్సర్లు కూడా ఉన్నాయి. అందులో ఒకటి మేం కూర్చున్న ప్లేస్ దగ్గర్లోనే పడింది... దాన్ని పట్టుకునేందుకు నేను చాలా ప్రయత్నించాను... గ్రేట్ మెమొరీస్...’ అంటూ చెప్పుకొచ్చాడు దినేశ్ కార్తీక్...
77
1998 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చెన్నైలో జరిగిన ఆ టెస్టు మ్యాచ్‌లో టీమిండియా 179 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది. సచిన్ టెండూల్కర్ 155 పరుగులు చేయగా సిరీస్‌ని 2-1 తేడాతో సొంతం చేసుకుంది భారత జట్టు...