ధోనీ బ్యాటింగ్‌లో టెక్నికే లేదు! అయినా ఆడాడుగా... శ్రేయాస్ అయ్యర్ కూడా అంతే! - మహ్మద్ కైఫ్

First Published Dec 19, 2022, 4:10 PM IST

వరల్డ్ బెస్ట్ ఫీల్డర్లలో భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఒకడు. బ్యాటుతో నిలకడగా రాణించకపోయినా మహ్మద్ కైఫ్ ఫీల్డింగ్ విన్యాసాల కోసం అతన్ని టీమ్‌లో కొనసాగిస్తూ వచ్చాడు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ. ధోనీ కెప్టెన్ అయ్యాక టీమ్‌లో చోటు కోల్పోయి రిటైర్ అయిన వారిలో మహ్మద్ కైఫ్ కూడా ఒకడు...

రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత క్రికెట్ ఎక్స్‌పర్ట్‌గా మారిన మహ్మద్ కైఫ్, నిర్మొహమాటంగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్‌ని భారత మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీతో పోలుస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు కైఫ్...

‘ధోనీ బ్యాటింగ్‌లో నాకు ఎప్పుడూ టెక్నిక్ కనిపించలేదు. నాకే కాదు, చాలామంది క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ కూడా మాహీ బ్యాటింగ్ గురించి ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేశారు. అయితే టెక్నిక్ లేకపోయినా మహేంద్ర సింగ్ ధోనీ పరుగులు చేశాడు, టీమిండియాకి విజయాలు అందించాడు..

శ్రేయాస్ అయ్యర్ కూడా ఈ కోవలోకే వస్తాడు. అతనికి టెక్నిక్ లేదు, అయితే పరుగులు ఎలా చేయాలో బాగా తెలుసు. అయ్యర్‌కి వీక్‌నెస్ ఉంది. పుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించి ఎక్కువగా అవుట్ అవుతున్నాడు. అయితేనేం ఈ ఏడాది ఎక్కువ పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు...

Image credit: PTI

శ్రేయాస్ అయ్యర్‌కి ఫామ్‌తో సంబంధం లేదు. ఫార్మాట్‌కి తగ్గట్టుగా బ్యాటింగ్‌ని మార్చుకుని పరుగులు రాబట్టగలుగుతాడు. తొలి ఇన్నింగ్స్‌లో శ్రేయాస్ అయ్యర్, ఛతేశ్వర్ పూజారా కలిసి చేసిన పరుగులు టీమిండియా విజయానికి కీలకంగా మారాయి...
 

తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకి భారీ ఆధిక్యం దక్కడానికి అయ్యర్, పూజారా చేసిన అమూల్యమైన పరుగులే కారణం. శ్రేయాస్ అయ్యర్ మంచి డ్రైవ్ షాట్స్ ఆడగలడు. అంతేనా క్రీజుని చక్కగా వాడుకుంటాడు. ప్రతీ బ్యాటర్‌కి ఏదో ఒక వీక్‌నెస్ ఉంటుంది..

శ్రేయాస్ అయ్యర్‌కి బౌన్సర్లు ఆడడం రాదు. నాకు తెలిసి తన జీవితాంతం ఈ వీక్‌నెస్ వెంటాడుతుంది. అయితే కొన్నిసార్లు వీక్‌నెస్‌ని తొలగించుకోవాలని ప్రయత్నించడం కంటే మరోదారిలో పరుగులు చేయడానికి ప్రయత్నించడం మంచిది. అయ్యర్ కూడా అదే చేస్తున్నాడు...’ అంటూ చెప్పుకొచ్చాడు భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్..

click me!