సయ్యద్ ముస్తాక్ ఆలీ 2020 సమయంలో కృనాల్ పాండ్యాతో గొడవపడి, బరోడా టీమ్ నుంచి బయటికి వచ్చేసిన దీపక్ హుడా.. ఐపీఎల్ 2021 సీజన్‌లో ఇచ్చిన పర్ఫామెన్స్ కారణంగా టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు..
Deepak Hooda
2022 ఫిబ్రవరిలో వెస్టిండీస్‌పై వన్డే ఆరంగ్రేటం చేసిన దీపక్ హుడా, అదే నెలలో శ్రీలంకపై టీ20 ఆరంగ్రేటం చేశాడు. ఆరంభ మ్యాచుల్లో అదరగొట్టిన దీపక్ హుడా, నాలుగో స్థానంలో ఆశాకిరణంలా కనిపించాడు. ఇదే సమయంలో విరాట్ కోహ్లీ పేలవ ఫామ్‌తో వరుసగా విఫలమవుతూ వచ్చాడు..
ఆసియా కప్ 2022 టోర్నీకి ముందు వరుసగా విఫలమవుతున్న విరాట్ కోహ్లీకి బదులుగా మంచి ఫామ్‌లో ఉన్న దీపక్ హుడాని టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఆడించాలని టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ చేసిన కామెంట్లు సంచలనం క్రియేట్ చేశాడు..
అయితే కపిల్ దేవ్ ఏ ఉద్దేశంతో ఆ కామెంట్లు చేశాడో కానీ అప్పటి నుంచి సీన్ రివర్స్ అయ్యింది. మూడేళ్లుగా ఫామ్‌లో లేని విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్‌ని అందుకుంటే, అప్పటిదాకా అదరగొట్టిన దీపక్ హుడా... ఒక్కసారిగా చల్లబడిపోయాడు.
Deepak Hooda
ఆసియా కప్‌లో ఫామ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌ని ఒంటిచేత్తో గెలిపించి, టీమ్‌లో తన స్థానంపై వచ్చిన విమర్శలకు బ్యాటుతోనే సమాధానం చెప్పాడు..
Deepak Hooda
అయితే విరాట్ కోహ్లీకి రిప్లేస్‌మెంట్‌గా భావించిన దీపక్ హుడా మాత్రం ఏడాదిగా అట్టర్ ఫ్లాప్ అవుతూ వస్తున్నాడు. జూన్ 2022లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ బాది, సంజూ శాంసన్‌తో కలిసి 176 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పిన దీపక్ హుడాని.. ఆసియా క్రీడలకు స్టాండ్‌బై ప్లేయర్‌గా ఎంపిక చేశారు సెలక్టర్లు..
Deepak Hooda
ఐపీఎల్ 2023 సీజన్‌లో 12 మ్యాచులు ఆడి కేవలం 84 పరుగులే చేసి అట్టర్ ఫ్లాప్ అయ్యాడు దీపక్ హుడా. అయినా అతన్ని ఆసియా క్రీడలకు ఎంపిక చేయడంపై విమర్శలు వచ్చాయి. 35కి పైగా సగటుతో పరుగులు చేసిన నితీశ్ రాణా వంటి ప్లేయర్లను కాదని, దీపక్ హుడాని ఎంపిక చేయడం కరెక్ట్ కాదని ట్రోల్స్ వినిపించాయి.
రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో ఆసియా క్రీడలు ఆడే టీమ్‌లో సీనియర్ ప్లేయర్లు ఉండాలనే ఉద్దేశంతోనే దీపక్ హుడాని చైనాకి పంపుతున్నట్టు తెలుస్తోంది.. 6 టీ20 అంతర్జాతీయ మ్యాచుల్లో 68.33 సగటుతో 350 పరుగులు చేసిన దీపక్ హుడా... టీమిండియాకి టీ20ల్లో ఇచ్చిన పర్ఫామెన్స్ కూడా అతని ఎంపికకి ఓ కారణం.
స్టాండ్ బై ప్లేయర్ కాబట్టి ఆసియా క్రీడల్లో దీపక్ హుడాకి ఆడే అవకాశం రావాలంటే తుది జట్టులో ఉన్న ప్లేయర్లు ఎవ్వరైనా గాయపడాల్సిందే. దీపక్ హుడా మళ్లీ భారత జట్టులో చోటు దక్కించుకోవాలంటే ఐపీఎల్ 2024 సీజన్‌లో బాగా ఆడడం ఒక్కటే మార్గం..