2011 వన్డే వరల్డ్ కప్ గెలిచిన 12 ఏళ్లకు మళ్లీ స్వదేశంలో ప్రపంచ కప్ ఆడేందుకు సిద్ధమవుతోంది టీమిండియా. 12 ఏళ్ల క్రితం వన్డే వరల్డ్ కప్ ఆడిన టీమ్‌లో ఒక్క విరాట్ కోహ్లీ మాత్రమే 2023 వన్డే వరల్డ్ కప్‌లో ఆడబోతున్నాడు. ఈ టోర్నీకి ముందు హర్భజన్ సింగ్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు..
2011 వన్డే వరల్డ్ కప్ టోర్నీ ఆడిన టీమ్‌లో హర్భన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్ వంటి మ్యాచ్ విన్నర్లు ఆడారు. అజారుద్దీన్, గంగూలీ, రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీలో 5 వరల్డ్ కప్ టోర్నీలు ఆడిన సచిన్ టెండూల్కర్, ధోనీ కెప్టెన్సీలో 2011 వన్డే వరల్డ్ కప్ టోర్నీ గెలిచాడు..
29
2011 వన్డే వరల్డ్ కప్ తర్వాత రెండేళ్లకు సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటే, అప్పటిదాకా టీమ్‌లో స్టార్లుగా వెలుగొందుతూ వచ్చిన సీనియర్లు... ఒక్కొక్కరిగా టీమ్‌లో చోటు కోల్పోవాల్సి వచ్చింది..
39
సచిన్ టెండూల్కర్‌తో పోటీపడి పరుగులు చేసిన భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌తో పాటు గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్ వంటి బ్యాటర్లు, జహీర్ ఖాన్ వంటి స్టార్ బౌలర్‌తో పాటు 700 వికెట్లు పడగొట్టిన హర్భజన్ సింగ్ కూడా కెరీర్ చివరి దశలో టీమ్‌లో ప్లేస్ కోసం ఎదురుచూడాల్సి వచ్చింది..
49
‘వరల్డ్ కప్‌లో టీమిండియా టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇచ్చింది. వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్, జహీర్ ఖాన్..ఇలా టీమ్‌లో ప్రతీఒక్కరూ మ్యాచ్ విన్నర్లే. మరి ఎందుకో తెలీదు. వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మేం అందరం కలిసి మ్యాచులు ఆడలేకపోయాం..
59
Image Credit: Getty Images
ఒకవేళ కాలాన్ని వెనక్కి తిప్పే అవకాశం వస్తే... నేను దీన్ని సరిచేయాలని అనుకుంటున్నా. 2011 వన్డే వరల్డ్ కప్ వరకూ భారత జట్టు టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇచ్చింది. అయితే 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచాక టీమ్‌లో చాలా మార్పులు జరిగాయి...
69
ప్రపంచ కప్ గెలిచిన ప్లేయర్లు, ఒక్కొక్కరిగా టీమ్‌కి దూరం అయ్యారు. అవును, మా వయసు పెరిగిందని నేను ఒప్పుకుంటా. అయితే పర్ఫామెన్స్ బాగున్నప్పుడు వయసుతో పనేంటి? 41 ఏళ్ల వయసులో జేమ్స్ అండర్సన్, ఇంగ్లాండ్‌కి ఆడడం లేదా...
నేను, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్.. అందరం కూడా 2015 వన్డే వరల్డ్ కప్ ఆడేందుకు కావాల్సినంతఫిట్‌గా ఉన్నాం. అయితే 2011 వరల్డ్ కప్ గెలిచిన మమ్మల్ని కావాలని పట్టించుకోలేదు. ఏం జరిగిందో, దీని వెనకాల ఎవరు ఉన్నారో నాకు తెలీదు..
89
అయినా అయిపోయిన దాని గురించి మాట్లాడడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. 2015 వన్డే వరల్డ్ కప్‌లో మేం ఆడి ఉంటే రిజల్ట్ మరోలా ఉండేదని మాత్రం నేను చెప్పగలను.
99
Harbhajan Singh and Irfan Pathan
2011 వన్డే వరల్డ్ కప్ నాటికి నా వయసు 31 ఏళ్లు. 2015 వరల్డ్ కప్ నాటికి 35.. అయితే 400 టెస్టు వికెట్లు తీసిన నాకు, మ్యాచ్ గెలవడానికి ఏం చేయాలో తెలీదా..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్..