ఇంగ్లాండ్ తప్పించింది! ఇక్కడికొచ్చి ఆసియా కప్‌తో అదిరిపోయే రిప్లై ఇచ్చిన క్రిస్ సిల్వర్‌వుడ్...

Published : Sep 12, 2022, 02:30 PM IST

ఆసియా కప్ 2022 టోర్నీలో అండర్‌ డాగ్‌గా అడుగుపెట్టింది శ్రీలంక. లసిత్ మలింగ, కుమార సంగర్కర, మహేళ జయవర్థనే, తిలకరత్నే దిల్షాన్ వంటి స్టార్ ప్లేయర్లు రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత లంక పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైంది. వరుస పరాజయాలతో ర్యాంకు కోల్పోయి, టీ20 వరల్డ్ కప్‌కి అర్హత సాధించేందుకు అసోసియేట్ దేశాలతో పోటీపడాల్సిన పరిస్థితి లంకది...

PREV
18
ఇంగ్లాండ్ తప్పించింది! ఇక్కడికొచ్చి ఆసియా కప్‌తో అదిరిపోయే రిప్లై ఇచ్చిన క్రిస్ సిల్వర్‌వుడ్...
Image credit: Getty

ఆసియా కప్ 2022 టోర్నీలోనూ లంకపై ఏ మాత్రం అంచనాలు లేవు. టీమిండియా కాకపోతే పాకిస్తాన్, లేదా ఆఖరికి ఆఫ్ఘనిస్తాన్ అయినా ఆసియా కప్ 2022 టైటిల్ గెలుస్తుందేమో కానీ శ్రీలంక... ఈ మూడు జట్లను ఓడించి టైటిల్ విజేతగా నిలుస్తుందని ఎవ్వరూ అంచనా వేయలేకపోయారు...

28
sri lanka

కారణం శ్రీలంక ప్రస్తుత ఫామ్.  టీమిండియాతో టీ20 సిరీస్‌లో ఒక్క మ్యాచ్ గెలవలేక, క్లీన్ స్వీప్ అయిన శ్రీలంక... ద్వైపాక్షిక సిరీసుల్లో ఒక్క విజయం సాధించడం కోసం నానా కష్టాలు పడాల్సి వస్తోంది. మరోపక్క ఆర్థిక సంక్షోభం...

38

ఈ ఆర్థిక సంక్షోభం కారణంగానేమో కానీ ఇంగ్లాండ్ జట్టు హెడ్ కోచ్‌గా తప్పించిన క్రిస్ సిల్వర్‌వుడ్‌ని పిలిచి మరీ, హెడ్ కోచ్‌గా నియమించుకుంది శ్రీలంక. లంకకి హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకోవడానికి ముందు ఇంగ్లాండ్ హెడ్ కోచ్‌గా వరుస పరాజయాలు ఎదుర్కొన్నాడు క్రిస్ సిల్వర్‌వుడ్...

48

క్రిస్ సిల్వర్‌‌వుడ్ కోచింగ్‌లో న్యూజిలాండ్ చేతుల్లో టెస్టు సిరీస్ కోల్పోయి, టీమిండియాతో టెస్టు సిరీస్‌లో 2-1 తేడాతో వెనకబడింది ఇంగ్లాండ్. యాషెస్ సిరీస్‌లో 4-0 తేడాతో చిత్తుగా ఓడిన ఇంగ్లాండ్ జట్టు, సిడ్నీలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఆఖరి వికెట్ కాపాడుకుని క్లీన్ స్వీప్ నుంచి తప్పించుకుంది...

58
Image credit: Getty

యాషెస్ సిరీస్ ఓటమి తర్వాత హెడ్ కోచ్‌గా ఉన్న క్రిస్ సిల్వర్‌వుడ్‌పై వేటు వేసింది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు. ఇది జరిగిన కొన్ని నెలలకే శ్రీలంక హెడ్ కోచ్‌గా ఆసియా కప్ 2022 టైటిల్ గెలిచాడు క్రిస్ సిల్వర్‌వుడ్...

68

రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్‌గా ఉన్న టీమిండియాని ఓడించిన శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌లకు చుక్కలు చూపించింది. వరుసగా ఐదు మ్యాచుల్లో నెగ్గి, రికార్డు స్థాయిలో ఆరో ఆసియా కప్ టైటిల్‌ని గెలిచింది శ్రీలంక. టీమిండియా ఏడు సార్లు ఆసియా కప్ టైటిల్ గెలిచి టాప్‌లో ఉంది.

78
Sri Lanka

తొలి మ్యాచ్‌లో ఓడిన తర్వాత ఆసియా కప్ టైటిల్ గెలిచిన ఏకైక జట్టు శ్రీలంక. ఇంతకుముందు 1986లోనూ మొదటి మ్యాచ్‌లో ఓడిపోయి టైటిల్ గెలిచిన లంక జట్టు, 36 ఏళ్ల తర్వాత ఆ ఫీట్‌ని మళ్లీ రిపీట్ చేసింది...

88

‘శ్రీలంక జట్టులో ఒక్క వరల్డ్ క్లాస్ బౌలర్ కూడా లేడు... వాళ్లను ఓడించడం పెద్ద కష్టమేమీ కాదు...’ అంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ ఖలీద్ మహమూద్ కామెంట్లు చేసిన తర్వాత టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇచ్చింది లంక జట్టు. ‘11 మంది సోదరులు కలిసి ఆడుతున్నప్పుడు వరల్డ్ క్లాస్ ప్లేయర్లు అవసరం లేదు...’ అంటూ ఖలీద్ మహమూద్‌కి లంక ప్లేయర్ మహీశ్ తీక్షణ ఇచ్చిన రిప్లై ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది..

click me!

Recommended Stories