2018-19 సీజన్‌లో సౌరాష్ట్ర కెప్టెన్ జయ్‌దేవ్ ఉనద్కడ్ గాయం కారణంగా బరిలో దిగకపోవడంతో అతని స్థానంలో పేసర్‌గా ఎంట్రీ ఇచ్చాడు చేతన్ సకారియా...
undefined
మొదటి మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన చేతన్ సకారియా, సీజన్ మొత్తంలో 30 వికెట్లు తీసి అదరగొట్టడు. సౌరాష్ట్ర రంజీ ట్రోఫీ గెలవడానికి కారణమైన చేతన్ సకారియాను రూ. 1.20 కోట్లకు కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్...
undefined
గత నెలలో సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 పాల్గొంటున్న సమయంలో చేతన్ సకారియా తమ్ముడు రాహుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే విషయం తెలిస్తే, టోర్నీ మధ్యలోనే వచ్చేస్తాడని తల్లిదండ్రులు, సకారియాకి తమ్ముడి మరణవార్త కూడా చెప్పలేదు...
undefined
‘సయ్యద్ ముస్తాక్ ఆలీ టోర్నీ ఆడడానికి వెళ్లినప్పుడు తమ్ముడు సూసైడ్ చేసుకున్నాడు. నేను టోర్నీ ముగించుకుని, ఇంటికి వచ్చేవరకూ నాకీ విషయం తెలియనివ్వలేదు... నా తమ్ముడు లేని లోటు తీర్చలేనిది...
undefined
ఇప్పుడు తమ్ముడు ఉండి ఉంటే, నాకంటే ఎక్కువ సంతోషించేవాడు... సంతోషం, దు:ఖం కలిసి రావడం అంటే ఇదేనేమో... 2020 సీజన్ సమయంలో వచ్చే సీజన్ ఆడతానని అనుకున్నాను...
undefined
గత సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి నెట్‌బౌలర్‌గా ఆడాను. నా బౌలింగ్ ఆర్‌సీబీ కోచ్‌లకు ఎంతో నచ్చింది. ఈసారి కచ్ఛితంగా ఐపీఎల్ ఆడతానని అనుకున్నాను... ఈ డబ్బుతో ఓ ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటున్నా’ అంటూ చెప్పాడు చేతన్ సకారియా.
undefined
చేతన్ సకారియా తండ్రి ఓ టెంపోవ్యాన్ డ్రైవర్. ఎన్నో ఆర్థిక కష్టాలను అనుభవించిన సకారియా, టీవీలో క్రికెట్ మ్యాచ్ చూడడానికి కూడా పక్కింటికో, స్నేహితుల ఇంటికో వెళ్లేవాడినని చెప్పాడు లెఫ్ట్ ఆర్మ్ పేసర్ చేతన్ సకారియా.
undefined