అప్పుడు నాతో డ్రింక్స్ మోయించారు! ఈ సెంచరీతో వాళ్లకు సమాధానం చెప్పా... - ఉస్మాన్ ఖవాజా...

Published : Mar 10, 2023, 12:16 PM IST

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్‌లో ఉన్న మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్... భారత పర్యటనలో ఇప్పటిదాకా ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు చేయలేకపోయారు. అయితే ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా మాత్రం ఓ సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 టోర్నీలో టాప్ స్కోరర్‌గా నిలిచాడు...

PREV
16
అప్పుడు నాతో డ్రింక్స్ మోయించారు! ఈ సెంచరీతో వాళ్లకు సమాధానం చెప్పా... - ఉస్మాన్ ఖవాజా...
Image credit: PTI

అహ్మదాబాద్‌లో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అజేయంగా 150 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు ఉస్మాన్ ఖవాజా. గత ఏడాది పాక్ పర్యటనలో 195 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన ఉస్మాన్ ఖవాజా, అహ్మదాబాద్ టెస్టులో డబుల్ సెంచరీ వైపు దూసుకుపోతున్నాడు..

26
Usman Khawaja

‘నేను ఇంతకుముందు ఎప్పుడూ సెంచరీ తర్వాత ఇంతలా నవ్వింది లేదు, ఈ సెంచరీ చాలా ప్రత్యేకం. ఇంతకుముందు రెండు సార్లు భారత పర్యటనకి వచ్చాను. అయితే 2013, 2017 భారత పర్యటనల్లో నన్ను  8 మ్యాచుల్లో డ్రింక్స్ బాయ్‌గానే వాడారు. ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడించలేదు...

36

నా కెరీర్ ఆరంభంలో నేను స్పిన్ ఆడలేదని అందరూ అనుకున్నారు. అందుకే ఇండియాలో టెస్టు మ్యాచులు ఆడే అవకాశం రాలేదు. ఐదేళ్ల క్రితం ఆడలేవని పక్కనబెట్టిన చోటే, ఓపెనర్‌గా వచ్చి సెంచరీ బాదడం చాలా గర్వంగా అనిపించింది. ఇప్పుడు నేను స్పిన్ ఆడలేనని విమర్శించిన వారందరికీ నేను సమాధానం చెప్పేశా...

46
Image credit: Getty

ఇండియాలో సెంచరీ చేస్తానని నేను అనుకోలేదు, అందుకే సెంచరీ అయ్యాక చాలా ఎమోషనల్ అయ్యా. స్పిన్ బౌలింగ్ ఎదుర్కోవడానికి చాలా ప్రాక్టీస్ చేశా. ఆత్మవిశ్వాసంతో సాధన చేశా. నాకు ఎవరి సహకారం దక్కలేదు.. టీమ్ కూడా నాకు సపోర్ట్ చేయలేదు...

56
Usman Khawaja

కోచింగ్ స్టాఫ్, సెలక్టర్లు ఎవ్వరూ నాకు అండగా నిలవలేదు. ఎన్నో కష్టాలను అనుభవించి, నా పొజిషన్‌ని దక్కించుకున్నా... అందుకే ఊరికే దాన్ని కోల్పోకూడదని గట్టిగా ఫిక్స్ అయ్యా. అదే పట్టుదలతో ప్రాక్టీస్ చేసి, విజయం సాధించా.. ఇప్పుడు నేను స్పిన్ చక్కగా ఆడగలను...’ అంటూ కామెంట్ చేశాడు ఉస్మాన్ ఖవాజా...
 

66
Usman Khawaja

12 ఏళ్ల తర్వాత భారత పర్యటనలో సెంచరీ సాధించిన లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు ఉస్మాన్ ఖవాజా. ఇంతకుముందు 2010-11 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆసీస్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ మార్కస్ నార్త్ సెంచరీ చేశాడు. 4  మ్యాచుల్లో 303 పరుగులు చేసిన ఉస్మాన్ ఖవాజా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు.. 

click me!

Recommended Stories