బెయిర్‌స్టో బాదుడు, బెన్ స్టోక్స్ దంచుడు... రెండో వన్డేలో ఇంగ్లాండ్ రికార్డు విజయం...

First Published Mar 26, 2021, 9:28 PM IST

336 పరుగుల భారీ టార్గెట్... గత మ్యాచ్‌లో కంటే 20 పరుగులు ఎక్కువే. గత మ్యాచ్‌తో పోలిస్తే ప్రత్యర్థి జట్టుకి మెరుపు ఆరంభం ఏమీ దక్కలేదు. అయితే మొదటి వన్డేలో చేసిన తప్పులు చేయకుండా ఇంగ్లాండ్ ఈజీ విక్టరీ అందుకుంది. భారత బౌలర్లు తేలిపోవడంతో ప్రత్యర్థికి భారీ లక్ష్యచేధనలో చాలా ఈజీగా మారిపోయింది. 

336 పరుగుల భారీ టార్గెట్ చేశామనే ధీమానో, లేక గత మ్యాచ్‌లో లాగ ఒక్క వికెట్ తీస్తే చాలు, వరుసగా వికెట్లు పడిపోయి ఆలౌట్ అయిపోతారనే ఆలోచనో కానీ రెండో వన్డేలో భారత బౌలర్లు ముకుమ్మడిగా తేలిపోయారు.
undefined
దాదాపు మ్యాచ్ టీమిండియా చేతుల్లోకి వెళ్లిపోయిందనుకునే దశలో మేలుకుని వికెట్లు తీసినా అప్పటికే ప్రత్యర్థి విజయం ఖరారు అయిపోయింది. ఫలితంగా ఇంగ్లాండ్ జట్టు భారీ లక్ష్యాన్ని సునాయాసంగా చేధించి, వన్డే సిరీస్‌ను సమం చేసింది...
undefined
జాసన్ రాయ్, జానీ బెయిర్ స్టో కలిసి మరోసారి ఇంగ్లాండ్‌కి అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. మొదటి వన్డేలో ఎదురైన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని బ్యాటింగ్ చేసిన ఈ జోడి, నిలకడగా పరుగులు రాబట్టింది...
undefined
16.3 ఓవర్లలో మొదటి వికెట్‌కి 110 పరుగులు జోడించారు జాసన్ రాయ్, జానీ బెయిర్ స్టో. ఈ ఇద్దరి మధ్య ఇది 13వ శతాధిక భాగస్వామ్యం. ఇంగ్లాండ్ తరుపున వన్డేల్లో అత్యధిక సార్లు సెంచరీ భాగస్వామ్యం నమోదుచేసిన జోడిగా నిలిచారు బెయిర్ స్టో, రాయ్... 52 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 55 పరుగులు చేసిన జాసన్ రాయ్, రోహిత్ శర్మ అద్భుతమైన త్రోకి రనౌట్ అయ్యాడు.
undefined
రాయ్ అవుటైన తర్వాత బెన్ స్టోక్స్‌తో కలిసి మొదట్లో నెమ్మదిగా పరుగులు చేసిన జానీ బెయిర్ స్టో సెంచరీ బాదాడు. వన్డేల్లో బెయిర్ స్టోకి ఇది 11వ సెంచరీ...
undefined
అంపైర్ వివాదాస్పద నిర్ణయం కారణంగా అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న బెన్ స్టోక్స్, ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు...40 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసుకున్న బెన్ స్టోక్స్, ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో వరుసగా హ్యాట్రిక్ సిక్సర్లు బాది 20 పరుగులు రాబట్టాడు.
undefined
ఆ తర్వాత కృనాల్ పాండ్యా వేసిన ఓవర్లో మూడు సిక్సర్లు, ఓ ఫోర్‌తో పాటు 28 పరుగులు రాబట్టాడు బెన్ స్టోక్స్... వన్డేల్లో అత్యధిక పరుగులు ఇచ్చిన రెండో బౌలర్‌గా చెత్త రికార్డు నమోదుచేశాడు కృనాల్ పాండ్యా...
undefined
2007లో యువరాజ్ సింగ్, 2013లో ఇషాంత్ శర్మ ఒకే ఓవర్‌లో 30 పరుగులు ఇవ్వగా, కృనాల్ పాండ్యా 28 పరుగులిచ్చి వారి తర్వాతి స్థానంలో నిలిచాడు.
undefined
ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో బెయిర్ స్టో, ఓ సిక్స్, రెండు ఫోర్లతో 15 పరుగులు రాబట్టగా భువీ బౌలింగ్‌లో ఫోర్ బాది 99 పరుగులకి చేరుకున్న బెన్ స్టోక్స్, ఆ తర్వాతి బంతికి అవుట్ అయ్యాడు... దీంత 175 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.
undefined
52 బంతుల్లో నాలుగు ఫోర్లు, 10 సిక్సర్లతో 99 పరుగులు చేసిన బెన్ స్టోక్స్, ఒక్క పరుగు తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు.. వన్డేల్లో 10 సిక్సర్లు బాది సెంచరీ పూర్తిచేసుకోలేకపోయిన మొట్టమొదటి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు బెన్ స్టోక్స్..
undefined
బెన్ స్టోక్స్ అవుటైన తర్వాతి ఓవర్‌లోనే బెయిర్ స్టోను అవుట్ చేశాడు ప్రసిద్ధ్ కృష్ణ. 112 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్లతో 124 పరుగులు చేసిన బెయిర్ స్టో, విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
undefined
అదే ఓవర్‌లో జో బట్లర్‌ని డకౌట్ చేశాడు ప్రసిద్ధ్ కృష్ణ. మూడు బంతులాడిన బట్లర్, పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు. టీమిండియాపై బట్లర్ డకౌట్ కావడం ఇది ఆరోసారి.
undefined
అయితే అప్పటికే విజయానికి 83 బంతుల్లో కేవలం 50 పరుగులు కావాల్సిన స్థితికి చేరుకుంది ఇంగ్లాండ్. భువీ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు బాదిన లివింగ్‌స్టోన్...21 బంతుల్లో 27 పరుగులు, డేవిడ్ మలాన్ 14 పరుగులు చేసి లాంఛనాన్ని ముగించారు.
undefined
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌లో ఏకంగా 20 సిక్సర్లు ఉండడం విశేషం. టీమిండియాపై ఇదే అత్యధికం. గత మ్యాచ్‌లో 9 ఓవర్లలో 68 పరుగులిచ్చిన కుల్దీప్ యాదవ్, ఈ మ్యాచ్‌లో ఏకంగా 10 ఓవర్లలో 84 పరుగులిచ్చాడు. కృనాల్ పాండ్యా 6 ఓవర్లలో 72 పరుగులిచ్చాడు.
undefined
click me!