కోహ్లీతో పాటు దిగ్గజాల రికార్డు బ్రేక్ చేసిన బాబర్ ఆజమ్.. వన్డేలలో మొదటి బ్యాటర్‌గా ఘనత

Published : May 05, 2023, 08:03 PM ISTUpdated : May 05, 2023, 08:09 PM IST

Babar Azam: పాకిస్తాన్  క్రికెట్ జట్టు సారథి బాబర్ ఆజమ్ మరో ఘనత అందుకున్నాడు. వన్డే క్రికెట్ లో వేగంగా  ఐదు వేల పరుగులు సాధించిన క్రికెటర్ గా నిలిచాడు. 

PREV
16
కోహ్లీతో పాటు దిగ్గజాల రికార్డు బ్రేక్ చేసిన బాబర్ ఆజమ్.. వన్డేలలో మొదటి బ్యాటర్‌గా ఘనత
Babar Azam

వన్డేలలో వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్ గా ఉన్న  బాబర్ ఆజమ్ 50 ఓవర్ల ఫార్మాట్ లో మరో ఘనత అందుకున్నాడు.  వన్డేలలో అత్యంత వేగంగా  ఐదు వేల పరుగులు  సాధించిన ఆటగాడిగా నిలిచాడు.  న్యూజిలాండ్ తో నాలుగో వన్డే సందర్భంగా  బాబర్  ఈ రికార్డును సాధించాడు. 

26
Image Credit: Getty Images

కరాచీ వేదికగా  న్యూజిలాండ్ తో జరుగుతున్న నాలుగో వన్డేలో  బాబర్ ఆజమ్.. వ్యక్తిగత స్కోరు  19 పరుగులకు చేరుకోగానే   అతడు వన్డేలలో ఐదు వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. తద్వారా గతంలో ఈ రికార్డు ఉన్న   హషీమ్ ఆమ్లా, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాల రికార్డును బ్రేక్ చేశాడు. 

36

బాబర్ కు   97వ ఇన్నింగ్స్ లలోనే ఈ ఘనతను సాధించాడు. గతంలో సౌతాఫ్రికా బ్యాటర్ హషీమ్ ఆమ్లా.. 101 ఇన్నింగ్స్ లలో  ఐదు వేల పరుగుల మైలురాయిని చేరి   అగ్రస్థానంలో ఉండగా ఇప్పుడు  బాబర్ ఈ రికార్డును బ్రేక్ చేశాడు. 

46

ఆమ్లా కంటే  ముందు  విండీస్ దిగ్గజం  వివిన్ రిచర్డ్స్.. 114 ఇన్నింగ్స్ లలో  ఐదు వేల పరుగుల మార్కును అందుకున్నాడు. టీమిండియా  రన్ మిషీన్ విరాట్ కోహ్లీ  కూడా  114 ఇన్నింగ్స్ లలోనే  ఐదు వేల పరుగుల మైలురాయిని చేరాడు.   

56

ఆస్ట్రేలియా  ఓపెనింగ్   బ్యాటర్ డేవిడ్ వార్నర్.. ఈ జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు.  వార్నర్.. 115 ఇన్నింగ్స్ లలో  ఐదు వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.  తాజాగా బాబర్ వీళ్లందరినీ అధిగమించి  97 ఇన్నింగ్స్ లలోనే  ఈ రికార్డు అందుకోవడం విశేషం. 

66

2015లో వన్డేలలో  ఎంట్రీ ఇచ్చిన బాబర్ ఇప్పటివరకు పాకిస్తాన్ తరఫున   99 మ్యాచ్ లు ఆడి  (97 ఇన్నింగ్స్)  5,088 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతడు ఇప్పటికే 18 సెంచరీలు సాధించడం విశేషం. బాబర్ పేరిట  26 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి.  వన్డేలలో బాబర్  సగటు  59.86గా నమోదైంది. 

click me!

Recommended Stories