విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో సమానంగా పరుగులు చేయడంలో పోటీపడిన క్రికెటర్ శిఖర్ ధావన్. అయితే స్టార్ ఇమేజ్ తెచ్చుకోవడంలో మాత్రం ధావన్ వెనకబడ్డాడు. ఐపీఎల్‌లో కోహ్లీ, రోహిత్ కెప్టెన్లుగా మారడం, శిఖర్ ధావన్ ప్లేయర్‌గానే కొనసాగడం కూడా దీనికి కారణం కావచ్చు...
13 సీజన్ల తర్వాత ఐపీఎల్‌లో పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకోబోతున్నాడు శిఖర్ ధావన్. ఐపీఎల్ 2023 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించబోతున్న శిఖర్ ధావన్, తాజా ఇంటర్వ్యూలో కొన్ని సంచలన విషయాలు బయటపెట్టాడు...
26
kohli rohit dhawan bumrah
‘ప్రతీ మనిషికి ఇగో ఉంటుంది. మనిషికి ఉండే సర్వసాధారణ లక్షణం అది. మేం కూడా మనుషులమే కదా.. టీమిండియా తరుపున ఆడేందుకు మేం ఏడాదిలో 220 రోజులు కలిసి ఉంటాం. అన్ని రోజులు కలిసి ఉన్నప్పుడు అప్పుడప్పుడు అభిప్రాయ భేదాలు రావడం, మనస్పర్థలు రావడం సర్వసాధారణ విషయం...
36
Virat Kohli-Rohit Sharma
మాలో కూడా చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. నేను రోహిత్, విరాట్ గురించి మాట్లాడడం లేదు. అందరి గురించి చెబుతున్నా.. సపోర్టింగ్ స్టాఫ్, మేనేజర్లతో కలిపి లెక్కేస్తే.. మేం దాదాపు 40 మంది టీమ్...
46
అంతమందిలో అందరూ కలిసి మెలిసి ఉండడం కుదరని పని. కొన్ని గొడవలు సహజం. ఓ వ్యక్తి చేసిన పని నాకు నచ్చకపోవచ్చు, నేను చేసిన పని మరొకరికి...
56
ఇలాంటి గొడవలు ఉన్నప్పుడే టీమ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ పెరుగుతుంది.. అన్నీ బాగుండి, అంతా బాగుంటే కొన్ని రోజులకే బోర్ కొడుతుంది..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్..
66
వన్డే వరల్డ్ కప్ 2019 తర్వాత టీ20 ఫార్మాట్‌లో చోటు కోల్పోయిన శిఖర్ ధావన్, 2022 తర్వాత వన్డే ఫార్మాట్‌కి కూడా దూరమయ్యాడు. శుబ్‌మన్ గిల్ వన్డేల్లో, టెస్టుల్లో, టీ20ల్లో ప్లేస్ ఫిక్స్ చేసుకోవడంతో వన్డేల్లో శిఖర్ ధావన్, టీ20, టెస్టుల్లో కెఎల్ రాహుల్.. టీమ్‌లో ప్లేస్ కోల్పోవాల్సి వచ్చింది.