ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ కొట్టగానే భయమేసింది, కానీ... శుబ్‌మన్ గిల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్...

First Published Jan 25, 2023, 9:32 AM IST

బంగ్లాదేశ్ టూర్‌లో డబుల్ సెంచరీ బాదిన తర్వాత కూడా ఆ తర్వాత మూడు మ్యాచుల్లో రిజర్వు బెంచ్‌కే పరిమితం అయ్యాడు ఇషాన్ కిషన్. ఓపెనర్‌గా యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ చూపించిన నిలకడైన పర్ఫామెన్స్‌ని మెచ్చిన టీమిండియా మేనేజ్‌మెంట్, ఇషాన్ కిషన్ కంటే గిల్‌పైనే నమ్మకం చూపించింది...

Image credit: PTI

బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ తర్వాత శ్రీలంకతో వన్డే సిరీస్‌లో 207 పరుగులు చేసి రాణించిన శుబ్‌మన్ గిల్, న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో దుమ్మురేపాడు. తొలి వన్డేలో డబుల్ సెంచరీ బాదిన శుబ్‌మన్ గిల్, మూడో వన్డేలో సెంచరీ చేసి... 3 మ్యాచుల్లో 360 పరుగులు చేసి ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ సొంతం చేసుకున్నాడు...

మూడు వన్డేల సిరీస్‌లో రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ కలిసి 32 ఫోర్లు బాదితే శుబ్‌మన్ గిల్ ఒక్కడే 38 ఫోర్లు బాదాడు. సిక్సర్ల విషయంలోనూ అంతే. శుబ్‌మన్ గిల్ ఒక్కటే 14 సిక్సర్లు బాదితే, రోహిత్, విరాట్, హార్ధిక్ కలిసి 14 సిక్సర్లు కొట్టారు...

Image credit: PTI

‘ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ చేసిన తర్వాత నా పనైపోయిందని అనుకున్నా. ఇక టీమ్‌లో నాకు చోటు దక్కడం కష్టమేనని అనిపించింది. ఎందుకంటే ఇషాన్ కిషన్ అలాంటి ఇన్నింగ్స్ ఆడిన తర్వాత మళ్లీ నాకు అవకాశం వస్తుందని అనుకోలేదు...

Image credit: PTI

అయితే రోహిత్ భాయ్, రాహుల్ సర్ నాపైన నమ్మకం ఉంచారు. ఇషాన్ కిషన్‌ని రిజర్వు బెంచ్‌లో కూర్చోబెట్టి నన్ను ఆడించారు. అతని ప్లేస్‌లో నేను ఉంటే ఎలా ఫీల్ అయ్యేవాడిని నాకు తెలుసు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని మరింత కష్టపడ్డాను...
 

Image credit: PTI

తొలి వన్డేలో డబుల్ సెంచరీ సాధించిన తర్వాత నాకు మరింత నమ్మకం కలిగింది. వాళ్లు పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేశానని అనిపించింది. ఈ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు చాలా ప్రత్యేకం. నా ఆటతీరులో ఎలాంటి మార్పు రాలేదు... 

shubman gill

పరిస్థితిని అర్థం చేసుకుని, ఓపికగా ఉండడం, మంచి ఆరంభాన్ని బాగా వాడుకోవడం నేర్చుకున్నా. వీటిపైనే ఫోకస్ పెట్టాను. నేను గణాంకాలను పట్టించుకోను. నా వరకూ నేను చేసిన పరుగులు టీమ్‌కి ఎంత ఉపయోగపడ్డాయనేది మాత్రమే నాకు ముఖ్యం...’ అంటూ చెప్పుకొచ్చాడు శుబ్‌మన్ గిల్... 

click me!