హైదరాబాద్ : దేశవ్యాప్తంగా శీతాకాలం చలిగాలుల తీవ్రత రోజురోజుకు మరింత పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఉష్ఱోగ్రతలు అంతకంతకు పడిపోతూ ప్రజలను వణికిస్తున్నాయి. ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో చలితీవ్రత తారాస్థాయికి చేరగా దక్షిణాదిన కూడా పంజా విసురుతోంది. దీంతో మద్యాహ్నం తప్పితే ఉదయం, రాత్రి సమయాల్లో ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావడానికి జంకుతున్నారు.