టేస్లా సిఈఓ ఎలోన్ మస్క్ ఒక్క ట్వీట్ తో ఆ కంపెనీ షేర్లు అమాంతం పెరిగిపోయాయి.. విషయం ఏంటంటే ?
First Published | Jan 26, 2021, 8:22 PM ISTటెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ మరోసారి నేడు వార్తల్లో నిలిచారు. కొద్దిరోజుల క్రితం ఎలాన్ మస్క్ ప్రపంచంలోని అత్యంత ధనవంతుడిగా అవతరించింది మీకు తెలిసే ఉంటుంది. తాజాగా ఎలోన్ మస్క్ చేసిన ట్వీట్ ఒక చిన్న కంపెనీల షేర్లు అకస్మాత్తుగా పెరిగిపోయాయి. ఎలోన్ మస్క్ మంగళవారం రోజున సోషల్ మీడియా ట్విట్టర్ లో 'ఐ కిండా లవ్ ఎట్సీ' అని ట్వీట్ చేశాడు. ట్వీట్ చేసిన కొద్దిసేపటికే ఎట్సీ స్టాక్ 9% వరకు పెరిగాయి.