ఇప్పుడు కొత్త డ్రైవింగ్ లైసెన్స్ పొందడం/ రేన్యువల్ చాలా సులభం.. ఎలా అంటే ?

First Published | Jan 26, 2021, 7:18 PM IST

కరోనా కాలంలో   ప్రజలు పని చేసే విధానంలో విపరీతమైన మార్పులు చోటుచేసుకున్నాయి. పిల్లల ఎడ్యుకేషన్ లేదా ఆఫీస్ వర్క్ అయినా, సాధ్యమైనంతవరకు ఆన్‌లైన్‌లోనే జరిగిపోతుంది. ఇది కొత్త డ్రైవింగ్ లైసెన్స్  లేదా రెన్యూవల్  కూడా ప్రభావితం చేసింది. కానీ ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్  పొందటం మునుపటి కంటే చాలా సులభం. కొన్ని రాష్ట్రాల్లో డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి ఆన్‌లైన్ దరఖాస్తులు మాత్రమే ఇప్పుడు అంగీకరించబడుతున్నాయి. ఇంతే కాకుండా ఉత్తర ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్‌గడ్  వంటి రాష్ట్రాలు ఇప్పుడు డ్రైవింగ్ లెర్నింగ్ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్ వంటి నిబంధనలలో మార్పులను అమలు చేయాలని నిర్ణయించాయి. ఈ రాష్ట్రాల్లో లెర్నింగ్ లైసెన్స్ పొందడానికి ఇప్పుడు ఎక్కువ సమయం పట్టదు. ఇప్పుడు దరఖాస్తుదారులు తమ లైసెన్స్‌ను ఆన్‌లైన్‌లోనే  ప్రింట్ చేసుకోవచ్చు.

మరో పక్క బీహార్‌లో డ్రైవింగ్ లైసెన్స్ పొందడం ఇప్పుడు చాలా సులభం అయ్యింది. పాట్నాతో సహా కొన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లాల రవాణా కార్యాలయాల్లో ఈ సౌకర్యం ప్రారంభమైంది. ఇది కాకుండా కొన్ని రాష్ట్రాలు ఇప్పుడు లెర్నింగ్ లైసెన్సుల కోసం ఫీజు వసూలు చేసే విధానంలో మార్పులు చేశాయి. లెర్నింగ్ లైసెన్స్‌లో మధ్యప్రదేశ్ కూడా పెద్ద మార్పులు చేసింది. మీ లైసెన్స్ మరొక నగరం నుండి వచ్చినట్లయితే ప్రస్తుత నగరంలో నివసించడానికి మీకు అడ్రస్ ప్రూఫ్ ఉంటే మీరు శాశ్వత లైసెన్స్ పొందవచ్చు. బీహార్‌లో, లెర్నింగ్ లైసెన్స్ కోసం స్లాట్ బుక్ అయిన వెంటనే మీరు రూ .740 చెల్లించాలి. మీరు స్లాట్‌ను బుక్ చేసిన వెంటనే, మీ సౌలభ్యం ప్రకారం మీరు లెర్నింగ్ లైసెన్స్ టెస్ట్ తేదీని పొందుతారు.
ఆన్‌లైన్‌లోనే లైసెన్స్‌ ప్రింట్బీహార్ రవాణా శాఖ ప్రకారం రాష్ట్రంలో ఆన్‌లైన్ దరఖాస్తులు మాత్రమే తీసుకుంటున్నారు. ఆఫ్‌లైన్ వ్యవస్థ రద్దు చేయబడింది. జిల్లా రవాణా కార్యాలయాల్లో ఆన్‌లైన్ టెస్ట్ జరుగుతోంది. 10 నిమిషాల పరీక్షలో 10 ప్రశ్నలు అడుగుతారు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే కనీసం 6 ప్రశ్నలకు సరిగ్గా సమాధానం ఇవ్వాలి. ఇప్పుడు దరఖాస్తుదారులు లెర్నింగ్ లైసెన్స్ సర్టిఫికేట్ కోసం ఆర్‌టి‌ఓలో వేచి ఉండాల్సిన అవసరం లేదు, కానీ ఈ సర్టిఫికేట్ మీ మెయిల్‌లోకి వస్తుంది, మీరు ఆన్‌లైన్‌లో ప్రింట్ తీసుకోవచ్చు.

కొత్త ఆర్‌టిఓలుఢీల్లీలో పెరుగుతున్న డ్రైవింగ్ లైసెన్స్ రద్దీ దృష్ట్యా, మరో నాలుగు ఆర్‌టిఓలను ప్రారంభించడానికి పరిశీలిస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్, అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్, వాహనాల రిజిస్ట్రేషన్ సహా 13 ఆర్‌టిఓలు ఢీల్లీలో పనిచేస్తున్నాయని ఢీల్లీ రవాణా మంత్రి కైలాష్ గెహ్లాట్ చెప్పారు. దీనితో పాటు, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు కూడా ప్రతి జిల్లాలో డ్రైవింగ్ లైసెన్స్ కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించాయి.
డ్రైవింగ్ లైసెన్స్, వాహనాల రిజిస్ట్రేషన్, ఫిట్ నెస్ సర్టిఫికేట్ వంటి ముఖ్యమైన సర్టిఫికేట్ వాలిడిటీని ప్రస్తుతం 2021 మార్చి 31 వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించబడింది. కరోనా మహమ్మారి కారణంగా కేంద్ర రహదారి రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఈ సర్టిఫికేట్ వాలిడిటీ పొడిగించడం 4వ సారి. అంతకుముందు ఆగస్టులో ప్రభుత్వం 2020 డిసెంబర్ 31 వరకు వాలిడిటీ పొడిగించింది. ఈ నిర్ణయం ద్వారా ప్రజలలో సురక్షితమైన సామాజిక దూరాన్ని కొనసాగిస్తూ రవాణాకు సంబంధించిన సేవలను పొందటానికి సహాయపడుతుందని తెలిపింది.
డ్రైవింగ్ లైసెన్స్ ను ఇలా రిన్యువల్ చేసుకోండి.లైసెన్స్‌ను అప్ డేట్ చేసుకోవడానికి రవాణా శాఖ వెబ్‌సైట్‌కి వెళ్లి డ్రైవింగ్ లైసెన్స్ సర్వీసెస్‌పై క్లిక్ చేయండి. తరువాత ఫారమ్ నింపేటప్పుడు మీరు మీ వ్యక్తిగత సమాచారాన్ని మీ డ్రైవింగ్ లైసెన్స్ నంబర్‌ ఎంటర్ చేయాలి. డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించిన మరిన్ని ముఖ్యమైన పత్రాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. ఆర్‌టిఓ కార్యాలయంలో బయోమెట్రిక్ వివరాలను తనిఖీ చేసిన తర్వాత మీ అన్ని సర్టిఫికెట్స్ ధృవీకరించబడతాయి. దీని తరువాత మీ లైసెన్స్ రిన్యువల్ చేయబడుతుంది.

Latest Videos

click me!