GST మార్పుతో ఈ కారుపై భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ. ల‌క్ష‌న్న‌ర వ‌ర‌కు త‌గ్గింపు

Published : Sep 06, 2025, 10:21 AM IST

Car Price Down: ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వం జీఎస్టీలో మార్పులు తీసుకొచ్చిన విష‌యం తెలిసిందే. దీంతో కొన్ని ర‌కాల వ‌స్తువుల ధ‌ర‌లు త‌గ్గ‌నున్నాయి. మ‌రి జీఎస్టీ త‌గ్గింపు హ్యుందాయ్ క్రెటా ధ‌ర‌పై ఎలాంటి ప్ర‌భావం చూపనుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
16
ఆటో మొబైల్ రంగానికి ఊర‌ట

భారత ప్రభుత్వం జీఎస్టీ పన్ను నిర్మాణంలో చేసిన మార్పులు ఆటో రంగానికి ఊరట కలిగించాయి. చిన్న కార్లపై తక్కువ పన్ను, పెద్ద SUV లపై ఎక్కువ పన్ను అమలు చేసినప్పటికీ, గతంలో వసూలు చేసిన సెస్‌ను పూర్తిగా తొలగించారు. దీని ప్రభావం హ్యుందాయ్ క్రెటా ధరలపై కూడా పడింది.

26
కొత్త GST రేట్లు ఎలా ఉన్నాయి?

చిన్న, మధ్య తరహా కార్లపై GST రేటు 18%గా నిర్ణయించారు.

పెద్ద SUV లపై GST రేటు 40%గా ఉంది.

ముఖ్యంగా, గతంలో అమలు చేసిన సెస్ (22%)ని పూర్తిగా తొలగించారు.

దీంతో మొత్తం పన్ను భారంలో తగ్గుద‌ల క‌నిపించ‌నుంది.

36
క్రెటాపై ఎంత తగ్గనుంది.?

హ్యుందాయ్ క్రెటా 1500CC కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న SUV. ముందుగా దీనిపై 28% GST + 22% సెస్, అంటే దాదాపు 50% పన్ను ఉండేది. కొత్త మార్పులతో ఇప్పుడు క్రెటా కేవలం 40% GST పరిధిలోకి వచ్చింది. అంటే మొత్తం పన్ను దాదాపు 10% తగ్గింది.

46
ధరల్లో వ‌చ్చే మార్పులు

ప్రస్తుతం హ్యుందాయ్ క్రెటా ఎక్స్-షోరూమ్ ధరలు రూ.11.11 లక్షల నుంచి రూ.20.76 లక్షల మధ్య ఉన్నాయి. కొత్త GST రేట్ల తర్వాత ఇవి సుమారు రూ.10.36 లక్షల నుంచి రూ.19.37 లక్షల మధ్యకు తగ్గవచ్చు. ఈ విధంగా క్రెటా ధరలు రూ.75,000 నుంచి రూ.1.40 లక్షల వరకు తగ్గే అవకాశం ఉంది.

56
హ్యుందాయ్ క్రెటా ఫీచ‌ర్లు ఎలా ఉన్నాయంటే.?

క్రెటా మూడు ఇంజిన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది:

* 1.5 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్

* 1.5 లీటర్ టర్బో పెట్రోల్

* 1.5 లీటర్ డీజిల్

* 6-స్పీడ్ మాన్యువల్

* IVT (ఇంటెలిజెంట్ వేరియబుల్ ట్రాన్స్మిషన్)

* 7-స్పీడ్ DCT (డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్)

* 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్

66
ఫీచర్లు, భద్రతా సదుపాయాలు

హ్యుందాయ్ క్రెటా లేటెస్ట్ వేరియంట్స్‌లో అత్యాధునిక ఫీచ‌ర్ల‌ను అందించారు. వీటిలో ప్ర‌ధానంగా ఉన్న ఫీచ‌ర్లు ఇవే..

* ADAS లెవల్-2 (అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్)

* 360 డిగ్రీల కెమెరా

* పవర్ డ్రైవర్ సీటు

* వెంటిలేటెడ్ సీట్లు

* మెరుగైన కనెక్టెడ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్

* 70 కంటే ఎక్కువ భద్రతా ఫీచర్లు

Read more Photos on
click me!

Recommended Stories