Business Idea: మీకు భూమి ఉందా.? రూ. 20 వేల పెట్టుబ‌డితో ల‌క్ష‌ల్లో సంపాదించ‌వ‌చ్చు.

Published : Jul 21, 2025, 03:21 PM IST

త‌క్కువ పెట్టుబ‌డితో ఎక్కువ లాభాలు వ‌చ్చే వ్యాపారాలు చేయాల‌ని ప్ర‌తీ ఒక్క‌రూ ఆశ‌ప‌డుతుంటారు. అయితే ఇందుకోసం స‌రైన ప్లానింగ్ ఉండాలి. అలాంటి ఒక బెస్ట్ బిజినెస్ ఐడియా నిమ్మ‌గ‌డ్డి సాగు. ఇందుకు సంబంధించిన పూర్తి వివ‌రాలు..

PREV
15
లెమన్ గ్రాస్ అంటే ఏంటి.?

లెమన్ గ్రాస్‌ (నిమ్మగడ్డి) ఒక సుగంధ మొక్క. వీటి పెంప‌కం చాలా సుల‌భం. ఇంత‌కీ ఈ ఆకుల‌తో ఉప‌యోగం ఏంట‌నేగా మీ సందేహం. లెమ‌న్ గ్రాస్ ఆకుల నుంచి నూనె త‌యారు చేస్తారు. ఈ నూనెకు ఔషధ రంగం, అరోమా థెరపీ, కాస్మెటిక్ పరిశ్రమల్లో విస్తృత డిమాండ్ ఉంది. నిమ్మగడ్డిలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలుండటంతో ఔషధంగా ఉపయోగపడుతోంది.

25
ఎంత పెట్టుబ‌డి కావాలి.?

లెమన్ గ్రాస్ సాగు మొదలుపెట్టడానికి పెద్దగా ఖర్చు ఉండదు. ఒక ఎకరా భూమిలో సాగు చేయాలంటే సుమారు రూ.20,000 నుంచి రూ.30,000 వ‌ర‌కు ఉంటే స‌రిపోతుంది. విత్త‌నాలు, భూమిని చ‌దును చేయ‌డం, నీటి ఏర్పాట్ల‌తో వంటి ఇత‌ర ప్రాథ‌మిక ఖ‌ర్చులు పెట్టుబ‌డిలోకి వ‌స్తాయి. ఇక ఈ సాగుకు ప్ర‌త్యేకంగా ఎరువులు అవ‌స‌రం ఉండ‌దు సేంద్రీయ ప‌ద్ధ‌తిలోనే చేసుకోవ‌చ్చు. ఒకసారి నాటిన తర్వాత 5–6 సంవత్సరాల పాటు అదే మొక్కలు కోతకు రావ‌డం విశేషం.

35
పంట ఎప్పుడు వేయాలి.?

లెమన్ గ్రాస్‌ను సాధారణంగా ఫిబ్రవరి నుంచి జూన్ మధ్యలో నాటితే మంచి ఫలితాలు వస్తాయి. ఒకసారి నాటిన మొక్కలు నాలుగు నెలల తర్వాత కోతకు సిద్ధమవుతాయి. సంవత్సరానికి 3–4 సార్లు కోత కోయవచ్చు. ప్రతి కోత తర్వాత మొక్కలు మళ్లీ పెరుగుతాయి. ఇలా ఒక ఏడాదిలో క‌నీసం 3 కోత‌లు వ‌స్తాయి.

45
లాభాలు ఎలా ఉంటాయి.?

ఒక ఎకరాలో సాగు చేస్తే సంవత్సరానికి సగటున 100–150 లీటర్ల నూనె లభిస్తుంది. మార్కెట్‌లో లెమన్ గ్రాస్ ఆయిల్‌ ధర రూ.1,200 – రూ.1,500 మధ్య ఉంది. ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్ వంటి ఈ కామ‌ర్స్ సైట్స్‌లో కూడా లెమ‌న్ గ్రాస్ ఆయిల్ బాటిల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇలా ఏడాదికి క‌నీసం రూ. 2 నుంచి రూ. 4 ల‌క్ష‌ల ఆదాయం పొందొచ్చు. పైగా ఇది ఎప్పుడూ డిమాండ్ ఉన్న ఉత్పత్తి కావడంతో విక్రయించడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు.

55
నిమ్మగడ్డి సాగుకు ప్రత్యేకతలు

లెమన్ గ్రాస్ సాగు చేయ‌డానికి ఎక్కువ నీరు అవసరం ఉండ‌దు. ఈ మొక్కలను అడవి జంతువులు తినవు, అంటే నష్టాల అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఎరువులు లేకుండానే సేంద్రీయంగా సాగు చేయవచ్చు. మొక్కలపై వ్యాధుల ప్రభావం కూడా తక్కువగా ఉంటుంది. పెద్ద‌గా హార్డ్ వ‌ర్క్ చేయాల్సిన ప‌ని కూడా లేదు.

గ‌మ‌నిక‌: పైన తెలిపిన విష‌యాలను కేవ‌లం ప్రాథ‌మిక స‌మాచారంగానే భావించాలి. ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టే ముందు అంత‌కు ముందే ఈ రంగంలో ఉన్న వారిని నేరుగా సంప్ర‌దించి. లాభాలు ఎలా ఉంటాయి.? ఈ గ‌డ్డిని ఎలా విక్ర‌యించాలి.? లాంటి వివ‌రాల‌ను అడిగి తెలుసుకొని వ్యాపారం మొద‌లు పెట్ట‌డం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories