iPhone 17: ఐఫోన్ 17 కొనేకన్నా... ఆ ఖర్చుతో వీసా లేకుండా ఈ దేశాలు తిరిగొచ్చేయచ్చు

Published : Oct 17, 2025, 12:12 PM IST

విదేశాలు తిరగాలని ఉన్నా చాలా మంది ఖర్చుకు భయపడతారు. ఐఫోన్ 17 ప్రో  (iPhone 17) కొనే ధరతో మీరు వీసా (Visa) లేకుండా ఎన్ని దేశాలు తిరిగి రావచ్చో తెలుసా? అన్నీ ఎంతో అందమైన దేశాలే.

PREV
15
భూటాన్

భారతీయులు ఎవరైనా వీసా లేకుండా ఈ దేశానికి వెళ్లవచ్చు.   పొగమంచుతో కప్పిన పర్వతాలు,  సంప్రదాయ మార్కెట్లు, టైగర్స్ నెస్ట్ మొనాస్టరీ లాంటివి ఎన్నో ఇక్కడ చూడవచ్చు.  వాస్తుశిల్పం, ఆహారం, సంస్కృతి పరంగా భూటాన్ మీకు ఎంతో అందమైన దేశంగా అనిపిస్తుంది.

25
నేపాల్

భారతీయులు వీసా లేకుండా నేపాల్ వెళ్లవచ్చు. ఇక్కడ హిమాలయాల అందాలు చూసేందుకు రెండు కళ్లూ చాలవు. పొఖారాలోని సరస్సులు, ట్రెక్కింగ్ చాలా అద్భుతంగా ఉంటాయి. స్థానిక సంస్కృతి, ఆహారాన్ని ఆస్వాదిస్తూ హాయిగా మీరు అక్కడ ఎంజాయ్ చేయవచ్చు.

35
థాయిలాండ్

థాయిలాండ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక్కడ ఉన్న బీచ్‌లు, స్ట్రీట్ ఫుడ్, ఆలయాలు కళ్లని కట్టిపడేస్తాయి.  భారతీయులు 60 రోజుల వరకు వీసా లేకుండా థాయిలాండ్‌లో ఉండవచ్చు. బ్యాంకాక్‌లో తిరిగితే సమయమే తెలియదు. నైట్ మార్కెట్లను కచ్చితంగా సందర్శించాలి.

45
మారిషస్

వీసా లేకుండా మారిషస్ వెళ్లవచ్చు. ఇక్కడి బీచ్‌లు ఎంతో అందంగా ఉంటాయి.  హనీమూన్, ఫ్యామిలీ ట్రిప్‌లకు మారిషస్‌లో ఎన్నో మంచి ప్రాంతాలు ఉన్నాయి. జలపాతాలు, తేయాకు తోటలు, బోటింగ్ వంటివన్నీ ఇక్కడ ఎంజాయ్ చేయవచ్చు. 

55
ఇండోనేషియా

అందమైన ద్వీపాల సముదాయాలు ఇండోనేషియాలో ఎన్నో ఉన్నాయి. అక్కడికి వెళ్లడానికి భారతీయులకు వీసా అవసరం లేదు. ఇక్కడ బాలి కచ్చితంగా చూడాలి. బీచ్‌లు, ఆలయాలు, అగ్నిపర్వతాలు, యోగా కేంద్రాలు, రిలాక్సేషన్ సెంటర్లు ఇలా ఎన్నో ఉన్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories