Gold Price: బంగారం ధ‌ర‌లు కుప్ప‌కూల‌నున్నాయా.? వ‌చ్చే ఏడాది తులం ఎంత కానుందో తెలుసా?

Published : Oct 17, 2025, 11:05 AM IST

Gold Price: 2025లో బంగారం ధ‌ర‌లు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఏడాది ప్రారంభం నుంచి సుమారు 61 శాతం ధ‌ర‌లు ఎగ‌బాకాయి. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఏడాది బంగారం ధ‌ర‌లు ఎలా ఉండ‌నున్నాయో తెలుసుకుందాం. 

PREV
15
బంగారం ధ‌ర‌లు పెర‌గ‌డానికి కార‌ణం ఏంటి.?

* ప్రపంచవ్యాప్తంగా రాజకీయ ఉద్రిక్తతలు

* ఆర్థిక అనిశ్చితి

* అమెరికన్ డాలర్ బలహీనత

* వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు

ఈ అంశాలన్నీ కలిసి బంగారానికి డిమాండ్ పెంచాయి. స్పాట్‌ గోల్డ్‌ ధర ఒక దశలో ఔన్స్‌కు 4,300 డాలర్లు చేరింది. ఇది చరిత్రలోనే అత్యధిక స్థాయి కావ‌డం గ‌మ‌నార్హం.

25
2026లో ధ‌ర‌లు ఎలా ఉండ‌నున్నాయి.?

ఆస్ట్రేలియా–న్యూజిలాండ్‌ బ్యాంక్‌ (ANZ Bank) తాజా నివేదిక ప్రకారం.. 2026లో బంగారం ధ‌ర‌లు త‌గ్గే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ రిపోర్ట్‌ ప్రకారం.. 2025 చివరికి బంగారం ధర ఔన్స్‌కు 4,400 డాలర్లు చేరవచ్చని అంచ‌నా వేస్తున్నారు. 2026 జూన్‌ నాటికి అది 4,600 డాలర్ల వరకు వెళ్లవచ్చని అంచనా. అయితే వ‌చ్చే ఏడాది ద్వితియార్థంలో మాత్రం బంగారం భారీగా ధరలు పడిపోవచ్చని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. వచ్చే ఏడాది చివరి నాటికి బంగారం ధరలో భారీగా పతనం కనిపిస్తుందని అంటున్నారు.

35
పెట్టుబడిదారుల ధోరణి

ప్రపంచంలో ఎప్పుడైనా అనిశ్చితి లేదా యుద్ధ పరిస్థితులు వచ్చినప్పుడు, ప్రజలు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తారు. ANZ నివేదిక ప్రకారం, రాజకీయ అస్థిరత, వాణిజ్య వివాదాలు, దౌత్య ఉద్రిక్తతలు కొనసాగితే పెట్టుబడిదారులు బంగారం వైపు మళ్లుతూనే ఉంటారు. అయితే ప్ర‌స్తుతం ర‌ష్యా ఉక్రెయిన్‌, ఇజ్రాయిల్-గాజాల మ‌ధ్య ఉద్రిక్త‌త త‌గ్గుముఖం ప‌డుతుండ‌డంతో ప‌రిస్థితులు మారే అవ‌కాశం ఉన్న‌ట్లు భావిస్తున్నారు. దీని కార‌ణంగా వ‌చ్చే ఏడాది తులం బంగారం రూ. ల‌క్ష లోపు దిగొచ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు.

45
ఫెడరల్‌ రిజర్వ్‌ నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది

అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ (US Fed) వడ్డీ రేట్లు పెంచితే లేదా అమెరికన్‌ ఆర్థిక వ్యవస్థ అంచనాల కంటే బలంగా ఉంటే, అప్పుడు బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంది. వడ్డీ రేట్లు తగ్గిస్తే మాత్రం బంగారం ధ‌ర మ‌రింత పెర‌గ‌డం ఖాయంగా అభిప్రాయ‌ప‌డుతున్నారు.

55
మొత్తంగా చెప్పాలంటే..

మొత్తం మీద 2025 చివరినాటికి బంగారం ఇంకా కొంత పెరిగే అవకాశం ఉంది కానీ 2026 రెండో భాగంలో ధరలు క్రమంగా తగ్గే అవకాశముంది. పెట్టుబడిదారులు తక్షణ లాభాలకంటే దీర్ఘకాల దృష్టితో జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. అందుకే కేవ‌లం బంగారంపైనే పెద్ద ఎత్తున పెట్టుబ‌డి పెట్ట‌డం మంచిది కాద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories