ప్రపంచ పర్యాటక దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు.. ఈ రోజుకి ప్రత్యేకత ఏంటి ?

First Published Sep 27, 2021, 12:28 PM IST

కొత్త ప్రదేశాలు చూడటం, ప్రయాణించడం, జ్ఞాపకాలను సేకరించడం ఎవరు ఇష్టపడరు చెప్పండి..? ప్రజలు ఎంత బిజీగా ఉన్నా వారి  బిజీ షెడ్యూల్ నుండి ఖచ్చితంగా ప్రయాణాలకు సమయం కేటాయిస్తుంటారు. ఒకే విషయం ఏమిటంటే ఎవరైనా ఫ్రెండ్స్ తో ప్రయాణించడానికి ఇష్టపడతారు, మరికొందరు కుటుంబంతో ట్రిప్ వెళ్లడానికి ప్లాన్ చేస్తుంటారు. 

కానీ దాదాపు ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు టూర్ కి వెళ్తుంటరు. పర్యాటకం నేటి కాలంలో ఉపాధిగా మారింది  దీని వల్ల చాలా మంది గృహాలు నడుస్తున్నాయి. భారతదేశంలోనే కాదు ప్రజలు ప్రపంచంలోని ఏ మూలకు వెళ్లిన అక్కడ పర్యాటకం  ఉంటుంది. ప్రపంచ పర్యాటక దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 27న జరుపుకుంటారు, కాబట్టి ఈ రోజు ఎలా ప్రారంభమైందో తెలుసుకోండి..

అందుకే ఈ రోజు జరుపుకుంటారు

నిజానైకి పర్యాటకం అనేది ఉపాధిని పెంచుతుంది. అందువల్ల ప్రపంచ పర్యాటక దినోత్సవం గురించి అవగాహన కల్పించడానికి, మరింతగా పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి జరుపుకుంటారు. ఈ రోజు దేశవ్యాప్తంగా, విదేశాల నుండి కూడా పర్యాటకులు పర్యాటకం  వైపు ఆకర్షితులవుతారు.

ఈ ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని 1970లో ప్రపంచ పర్యాటక సంస్థ నేడు జరుపుకోవడం ప్రారంభించింది. దీని తరువాత మొదటిసారిగా ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని 1980 సెప్టెంబర్ 27న జరుపుకున్నారు, ఆ తర్వాత ప్రతి సంవత్సరం ప్రపంచ పర్యాటక దినోత్సవం సెప్టెంబర్ 27న జరుపుకుంటారు.

ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకోవడానికి  ఉద్దేశ్యం

ఈ రోజును జరుపుకోవడం ఒక సాధారణ లక్ష్యం అలాగే పర్యాటకం ద్వారా ప్రజలకు ఉపాధిని కల్పించడం. ప్రజలు ఏదైన ఒక ప్రదేశాన్ని సందర్శించడానికి వెళ్ళినప్పుడు  కొత్త ప్రదేశాలలో తిరుగుతుంటారు, షాపింగ్ చేస్తారు, ఆహారం తింటారు. ఇలాంటి పరిస్థితిలలో అక్కడి ప్రజలు  సౌకర్యాలను కల్పించాల్సిన అవసరం ఉంటుంది, ఒక విధంగా పర్యాటకం కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది.

click me!