మహిళలు వ్యాపారం చేయడం ద్వారా మీరు మంచి ఆదాయం పొందాలని ప్లాన్ చేస్తున్నారా అయితే ఇంటి వద్ద ఉంటూనే చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది అలాంటి ఓ మంచి బిజినెస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. . ఈ బిజినెస్ చేయడం ద్వారా కనీసం నెలకు 50 వేల కన్నా ఎక్కువ డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం
ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కానీ పెళ్లిళ్లు ఫంక్షన్లలో మహిళలు మగ్గం వర్క్ తో చేసినటువంటి చీరలు జాకెట్లను ధరించేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు ముఖ్యంగా మగ్గం వర్క్ ద్వారా డిజైన్ చేసినటువంటి బ్లౌజులు, గాగ్రా చోళీలు, హాఫ్ శారీలు ధరించేందుకు మహిళలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. . నిజానికి మగ్గం వర్క్ ను జర్దోసి వర్క్ అని పిలుస్తారు ఇది ఉత్తరాదికి చెందినటువంటి ఒక కళ. మగ్గంపై బంగారు వన్నె దారంతో అందమైన డిజైన్లను తయారు చేస్తారు.
మగ్గం వర్క్ ద్వారా మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది మీరు గనక మగ్గం వర్క్ నేర్చుకున్నట్లయితే ప్రతిరోజు వేలల్లో ఆదాయం సంపాదించే అవకాశం ఉంటుంది. అయితే మగ్గం వర్క్ నేర్చుకోవడం అనేది ఎలా అనే ప్రశ్న చాలా మందికి తలెత్తుతూ ఉంటుంది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే సెట్విన్ సంస్థ ఈ మగ్గం వర్క్ నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. ఇందులో మీరు అతి తక్కువ ధరకే మగ్గం వర్క్ నేర్చుకోవచ్చు తద్వారా మీరు సొంతంగా షాపు పెట్టుకొని చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది.
కేవలం 1000 రూపాయల నుంచి 3500 రూపాయలకే మీరు సెట్విన్ సంస్థలో మహిళా ఉపాధికి సంబంధించినటువంటి అనేక కోర్సులను నేర్చుకోవచ్చు. మీరు మగ్గం వర్క్ నేర్చుకోవాలి అనుకుంటే… 3,500కే 6 నెలల పాటు నేర్పించే అడ్వాన్స్డ్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ నేర్చుకోవడం ద్వారా మీరు చక్కటి ఫ్యాషన్ డిజైనర్ గా అవతరించే అవకాశం ఉంది తద్వారా మీరు బోటిక్ సైతం నిర్వహించుకోవచ్చు ఇందులో భాగంగా మీకు మగ్గం వర్క్ కూడా నేర్పిస్తారు.
మీరు మగ్గం వర్క్ నేర్చుకోవడం ద్వారా ప్రతిరోజు కనీసం 1500 రూపాయలు నుంచి 5000 రూపాయల వరకు సంపాదించుకోవచ్చు ఈ లెక్కన చూసినట్లయితే ప్రతినెలా కనీసం 50 వేల రూపాయల నుంచి ఒక లక్ష రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం ఉంది అంతే కాదు సీజన్లో ఇంతకన్నా ఎక్కువ డబ్బు కూడా సంపాదించవచ్చు ప్రధానంగా పెళ్లిళ్లు ఫంక్షన్లు ఎక్కువగా జరిగే సీజన్లో మీకు డిమాండ్ ఎక్కువగా లభిస్తుంది. తద్వారా ఆదాయం కూడా పెరుగుతుంది. మగ్గం వర్క్ నేర్చుకోవడం ద్వారా మీరు ఇతరులకు కూడా శిక్షణ ఇవ్వడం ద్వారా అదనపు ఆదాయం కూడా సంపాదించే అవకాశం ఉంది.