Ratan Tata will : వ్యాపార వర్గాల్లో అసాధారణంగా కనిపంచే అరుదైన చర్యలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రతన్ టాటా.. చనిపోయిన తర్వాత కూడా తన గొప్పతనాన్ని మరోసారి చాటుకున్నారు. ఆయనకు పెంపుడు జంతువులు అంటే చాలా ఇష్టం. తనతో ఉన్నవారు ఎంత చిన్నవారైనా, పేదవారైనా వారితో ఎంతో మర్యాదగా ఉంటారు. ఆయన మరణం తర్వాత ఆయన రాసిన వీలునామా విషయాలు బయటకు వచ్చాయి. అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాయి. ఏకంగా 10 వేల కోట్ల తన సంపదలో పెంపుడు కుక్క, వంట మనిషి, బట్లర్లకు రక్షణ వాటాలు వంటి విషయాలను గురించి ప్రస్తావించారని సమాచారం.
Ratan tata with his dog
రతన్ టాటా తన మరణానంతరం తన పెంపుడు కుక్క అయిన జర్మన్ షెపర్డ్ టిటో కోసం అపరిమిత సంరక్షణను అనుమతించడానికి తన వీలునామాలో నిబంధనలను రూపొందించినట్లు మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. రతన్ టాటా మరణం తర్వాత తన పెంపుడు కుక్కను ఆయన వద్ద చాలా కాలంగా వంటమనిషిగా పనిచేస్తున్న రాజన్ షా చూసుకుంటారని తన వీలునామాలో పేర్కొన్నారని సమాచారం. అలాగే, రతన్ టాటాతో మూడు దశాబ్దాల సంబంధాన్ని పంచుకున్న అతని బట్లర్ సుబ్బయ్యకు సంబంధించిన నిబంధనలను కూడా తన వీలునామాలో చేర్చారు.
రూ. 10,000 కోట్లకు పైగా ఆస్తులు కలిగి ఉన్న రతన్ టాటా తన సంపదలో తన ఫౌండేషన్, సోదరుడు జిమ్మీ టాటా, సవతి సోదరులు షిరీన్, డీనా జెజీబోయ్, గృహ సిబ్బంది, ఇతరులకు వాటాలు కట్టబెట్టారు. అతని ఆస్తులలో అలీబాగ్‌లోని 2,000 చదరపు అడుగుల బీచ్ బంగ్లా, ముంబైలోని జుహు తారా రోడ్‌లోని 2-అంతస్తుల ఇల్లు, రూ. 350 కోట్లకు పైగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు, 165 బిలియన్ డాలర్ల టాటాకు చెందిన టాటా సన్స్ గ్రూప్ లో 0.83% వాటాలు ఉన్నాయి. వీటిని రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్ (RTEF)కి బదిలీ చేయనున్నారు.
ratan tata
ఈ ఏడాది ఆగస్టులో విడుదల చేసిన హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 ప్రకారం రతన్ టాటా టాటా సన్స్‌లో 0.83% వాటాను కలిగి ఉన్నారు. రూ.7,900 కోట్ల నికర విలువను కలిగి ఉన్నారు. తన సంపదలో గణనీయమైన భాగం దాతృత్వానికి, సమాజ సేవకు వెళ్లాలని ఆయన ఎప్పుడు దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే వారు. అతని వీలునామా వివరాలు గోప్యంగా ఉన్నాయి. గ్రూప్ లిస్టెడ్ సంస్థలలో టాటా సన్స్ వాటా మార్కెట్ విలువ దాదాపు రూ.16.71 లక్షల కోట్లు అని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
$165 బిలియన్ల టాటా గ్రూప్‌కు చెందిన హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్‌లో 0.83% వాటాను కలిగి ఉన్న రతన్ టాటా ఆస్తులు రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్ (RTEF)కి బదిలీ చేస్తారు. చారిటబుల్ ట్రస్ట్‌లకు షేర్లను కట్టబెట్టే టాటా గ్రూప్ సంప్రదాయానికి అనుగుణంగా అతని వాటా రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్ (RTEF)కి బదిలీ చేయబడుతుంది. టాటా సన్స్ అధినేత ఎన్ చంద్రశేఖరన్ ఆర్‌టీఈఎఫ్‌కు అధ్యక్షత వహించే అవకాశం ఉందని వర్గాలు సూచిస్తున్నాయి.
డిసెంబరు 28, 1937న జన్మించిన రతన్ టాటా 2024 అక్టోబరు 9న ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో కన్నుమూశారు. నాయకత్వం, నైతిక వ్యాపార పద్ధతులు, దాతృత్వంలో శాశ్వత గొప్ప వారసత్వాన్ని మిగిల్చారు. 1991 నుండి 2012 వరకు టాటా గ్రూప్ ఛైర్మన్‌గా, 2016లో తాత్కాలిక ఛైర్మన్‌గా కొంతకాలం పనిచేసిన ఆయన సంస్థను 1991లో $5.7 బిలియన్ల నుండి 2012 నాటికి $100 బిలియన్లకు చేర్చడంలో కీలక పాత్ర పోషించారు.