మోనాలిసా ఎవరు.. ఆమె పెయింటింగ్ రహస్యం ఏమిటి.. దీని విలువ ఎందుకు 6 వేల కోట్లు పలికిందంటే..

First Published Aug 28, 2021, 1:13 PM IST

 మీలో చాలామందికి గొప్ప ఇటాలియన్ ఫీలోసఫర్, పేయింటర్ లియోనార్డో డా విన్సీ గురించి వినే ఉంటారు. యూరోపియన్ పునరుజ్జీవనోద్యమంలో చాలా మంది గొప్ప ఫీలోసఫర్లు ఉన్నారు, వారిలో లియోనార్డో కూడా ఒకరు. ఆయన వేసిన ‘మోనాలిసా’ పెయింటింగ్ నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. 

అన్నింటికంటే ఈ పెయింటింగ్‌లో ఏముంది అని చాలా మంది నిపుణులు దీని గురించి  పరిశోధన  కూడా చేస్తున్నారు..? అయితే ఈ పెయింటింగ్ రహస్యం పై ఒక సమాచారం మీకోసం, నేడు ఈ పెయింటింగ్ ధర సుమారు $ 867 మిలియన్లు అంటే దీని విలువ భారతదేశంలో 6.4 వేల కోట్లు. లియోనార్డో డా విన్సీ 1503 సంవత్సరంలో ఈ పెయింటింగ్‌ను రూపొందించడం ప్రారంభించి  1517 సంవత్సరం దాకా కొనసాగించాడు. లియోనార్డో  అతిపెద్ద సమస్య మొనాలిసా పెదాలను రూపొందించడం. మోనాలిసా పెదాలను మాత్రమే పేయింట్ చేయడానికి అతనికి దాదాపు 12 సంవత్సరాలు పట్టింది.

మోనాలిసా పెయింటింగ్ లో  అతి పెద్ద రహస్యం ఆమె చిరునవ్వు. చాలా కాలంగా చాలా మంది నిపుణులు ఆమె చిరునవ్వుపై  అధ్యయనం చేస్తున్నారు. మోనాలిసా  ఈ మిస్టరీ చిరునవ్వు వివిధ కోణాల నుండి చూసినప్పుడు భిన్నంగా కనిపిస్తుంది. మీరు ఏ ఒక కోణంలో చూసిన ఆమె చిరునవ్వు నవ్వుతూ కనిపిస్తుంది.  కానీ మరొక కోణం నుండి చూసినప్పుడు ఆమె చిరునవ్వు మసకబారుతుంది.

లియోనార్డో పెయింటింగ్ చేసింది మహిళ  ముఖం అని, అతను ఈ పెయింటింగ్ లో ఒక రహస్యాన్ని దాచాడని ఈ కారణంగా మోనాలిసా చిరునవ్వు చాలా రహస్యంగా ఉందని కూడా చెబుతుంటారు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక వైద్యుడు ఈ రహస్యం గురించి మోనాలిసా పై రెండు దంతాలు విరిగిపోయాయని దీని కారణంగా ఆమె పై పెదవి కొద్దిగా లోపలికి నొక్కి ఉందని చెప్పాడు.

2000 సంవత్సరంలో హార్వార్డ్ న్యూరో సైంటిస్ట్ మోనాలిసా పెయింటింగ్‌పై పరిశోధన చేసిన తర్వాత మోనాలిసా చిరునవ్వు ఎన్నటికీ మారదు అది మీ మనస్తత్వంలాగే ఉంటుందని చెప్పారు. మీరు మోనాలిసా పెయింటింగ్‌ను చూసినపుడు మీరు సంతోషంగా ఉంటే మీరు మోనాలిసా నవ్వుతూ కనిపిస్తుంది. మరోవైపు మీరు విచారంగా ఉంటే అప్పుడు మోనాలిసా చిరునవ్వు మసకబారుతుంది అని చెప్పారు.
 

ఈ రోజుకి కూడా మోనాలిసా ఎవరో తెలియదు? అంటే లియోనార్డో రూపొందించిన పెయింటింగ్ అమ్మాయి ఇప్పటికీ ఒక రహస్యం. మోనాలిసా లియోనార్డో తప్ప మరెవరో కాదని ఒక థియోరి చెబుతోంది. ఈ పెయింటింగ్‌లో లియోనార్డో తనను తాను స్త్రీగా పేయింట్ చేసుకున్నాడు. ఇది ఇప్పటివరకు అత్యంత విలువైన పెయింటింగ్, దీని విలువ సుమారు $ 867 మిలియన్లు. భారతదేశంలో దీని ధర సుమారు 6.4 వేల కోట్లు.

click me!