ఈ ప్రభుత్వ పథకం కింద మీరు ప్రతి నెలా 3వేల పెన్షన్ పొందవచ్చు.. ఎలా అంటే ?

First Published Aug 26, 2021, 1:29 PM IST

మన భవిష్యత్తు మెరుగుపర్చుకునేందుకు మనము ఎంతో కష్టపడుతుంటాము కానీ ఈ ద్రవ్యోల్బణ యుగంలో మనం మన కలలన్నీ నెరవేర్చలేకపోవచ్చు. అందువల్ల ప్రజలు అవసరాలను తీర్చేందుకు పదవీ విరమణ తర్వాత పెన్షన్ సదుపాయాన్ని తీసుకుంటారు. ఇందుకు మనము ఎన్నో ఆర్థిక ప్రణాళికలు కూడా చేస్తాము. 

 ఈ రోజు  అలాంటి ప్రభుత్వ పథకం గురించి మీకోసం.. దీని సహాయంతో మీరు ప్రతి నెలా రూ .55 నుండి రూ .200 పెట్టుబడి పెట్టడం ద్వారా భారీ పెన్షన్ పొందవచ్చు. ఈ ప్లాన్ చాలా ఉపయోగకరంగా కూడా ఉంటుంది, ప్రధాన మంత్రి శ్రమ యోగి మంధన్ యోజన కింద మీరు నెలకు మూడు వేల రూపాయలు అంటే ఏడాదికి 36,000 రూపాయల పెన్షన్ పొందవచ్చు. అలాగే ఆ వ్యక్తి మరణం తరువాత, అతని జీవిత భాగస్వామికి 50 శాతం పెన్షన్ లభిస్తుంది.

ఎవరు ప్రయోజనం పొందగలరు?

ప్రధాన మంత్రి శ్రమ యోగి మంధన్ యోజన ఆన్ ఆర్గనైజేడ్ రంగ కార్మికుల కోసం. ప్రధాన మంత్రి శ్రమ యోగి మంధన్ యోజన ప్రయోజనాన్ని పొందాలంటే వారు  ఆన్ ఆర్గనైజేడ్ రంగంలో కార్మికులుగా ఉండాలి. ఈ పథకం రిక్షా కార్మికులు, మధ్యాహ్న భోజన కార్మికులు, హెడ్ లోడర్లు, ఇటుక బట్టీ కార్మికులు, గృహ కార్మికులు, ఇంటింటికీ తిరిగి పనిచేసేవారు,  వ్యవసాయ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు మొదలైన వారి కోసం. అలాగే మీ నెల ఆదాయం రూ .15,000 లేదా అంతకంటే తక్కువ ఉండాలి. ఈ పథకాలను పొందడానికి మీ వయస్సు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎలా ప్రయోజనం పొందాలి?

ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి  ఆధార్ కార్డ్, బ్యాంక్ ఖాతా ఫోటోకాపీ తీసుకొని కామన్ సర్వీస్ సెంటర్ (CSC)లో రిజిస్టర్ చేసుకోవచ్చు. బయోమెట్రిక్ ద్వారా నేరుగా రిజిస్ట్రేషన్ చేయబడుతుంది. ఈ కేంద్రాల ద్వారా ఆన్‌లైన్‌లో మీ మొత్తం సమాచారం భారత ప్రభుత్వానికి వెళ్తుంది. దీనిని సద్వినియోగం చేసుకోవడానికి మీకు మీ ఆధార్ కార్డు, సేవింగ్స్ లేదా జన్ ధన్ బ్యాంక్ ఖాతా పాస్‌బుక్, మొబైల్ నంబర్ అవసరం. 

పూర్తి సమాచారం కోసం ఈ నంబర్‌కు కాల్ చేయండి

మీరు శ్రామిక్ సువిధ కేంద్రాన్ని సందర్శించడం ద్వారా ఈ పథకం గురించి పూర్తి సమాచారాన్ని పొందవచ్చు. ఈ పథకం టోల్ ఫ్రీ నంబర్ 18002676888. ఈ నంబర్‌కు కాల్ చేయడం ద్వారా మీరు  దీని గురించి మరింత సమాచారాన్ని పొందవచ్చు.

click me!