రూ.36,000 కడితే 43 కి.మీ. మైలేజ్ ఇచ్చే ఈ Qute కారు మీ సొంతం

First Published | Nov 22, 2024, 4:18 PM IST

చూడటానికి క్యూట్ గా ఉన్న ఈ కారు పేరు కూడా Qute. కారు చిన్నదే అయినా ఫీచర్లు పెద్ద కార్లకు ఏమీ తక్కువ కాదు. చిన్న ఫ్యామిలీ సిటీల్లో తిరిగేందుకు, లోకల్ గా చిన్న చిన్న పనులు చేసుకునేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ కారు ఇచ్చే మైలేజ్ ఆశ్చర్యం కలిగించక మానదు. Bajaj కంపెనీకి చెందిన ఈ కారు గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి. 

Bajaj Qute RE60 ఒక మైక్రో కారు (Quadricycle). దీన్ని ముఖ్యంగా చిన్న ప్రయాణాల కోసం తయారు చేశారు. ఇది సిటీస్ లో చిన్న చిన్న పనుల కోసం ఉపయోగించుకోవచ్చు. ఇది 2019లో లాంచ్ అయ్యింది. తక్కువ ఇంధన వినియోగం, తక్కువ బడ్జెట్ లో ఇది దొరుకుతుంది. బజాజ్ క్యూట్ RE60 ఫీచర్స్, లుక్, డిజైన్ చాలా అద్భుతంగా ఉంటాయి. 

తక్కువ బడ్జెట్‌లో Bajaj Qute RE60 కారుని కొనుక్కొని సిటీలో తిరగొచ్చు. హార్డ్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, ఏసీ, రూఫ్, డోర్లు, స్టీరింగ్ వీల్, 2×2 సీట్లు, 20 లీటర్ల బూట్ స్పేస్ వంటి ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. డ్రైవర్ సహా ఇందులో నలుగురు కూర్చొనే సీటింగ్ సామర్థ్యం ఉంది. కారు చిన్నగా ఉండటం వల్ల ట్రాఫిక్ లో తేలికగా డ్రైవ్ చేయవచ్చు. ఇందులో ప్రయాణించే వారి రక్షణ కోసం సీటు బెల్ట్స్ ఉన్నాయి. Bajaj Qute RE60 కారు బాడీ కూడా బలంగా ఉంటుంది. కొద్దిపాటి లగేజి కోసం కూడా ఇందులో చోటు ఉంది. 


Bajaj Qute RE60లో 217cc ఇంజిన్ ఉపయోగించారు. పెట్రోల్, CNG ఆప్షన్లు కూడా ఇందులో ఉన్నాయి. గంటకు 70 కి.మీ వేగంతో ఈ బుల్లి కారు ప్రయాణించగలరు. 4 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, 13 bhp పవర్, 19.6 Nm టార్క్ ఇందులో ఉన్నాయి. సుమారుగా 452 కిలోల బరువున్న ఈ కారు ఆటో కన్నా సేఫ్. రియర్ ఇంజిన్, రియర్ వీల్ డ్రైవ్, LPG ఆప్షన్ కూడా ఇందులో ఉంది. సింగిల్ సిలిండర్ కలిగి ఉంటుంది. ఇది గరిష్టంగా 70 కి.మీ./గం వేగంతో దూసుకుపోతుంది. 

బజాజ్ క్యూట్ RE60 పెట్రోల్ వేరియంట్ 35 కి.మీ మైలేజ్ ఇస్తుంది. అదే CNG వేరియంట్ అయితే 43 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఈ మోడల్ కారు మూడు కలర్స్‌లో లభిస్తుంది.

ఇక కొలతలు, డిజైన్ విషయానికొస్తే దీని పొడవు 2,752 మి.మీ., వెడల్పు 1,312 మి.మీ., ఎత్తు 1,652 మి.మీ., గ్రౌండ్ క్లియరెన్స్ 180 మి.మీ. ఉంటుంది. దీని బరువు సుమారుగా 452 కిలోలు. 

బజాజ్ క్యూట్ RE60 కారు ధర రూ. 3.61 లక్షలు. అయితే మీరు రూ. 36,000 డౌన్ పేమెంట్ చెల్లించి ఈ కారును ఇంటికి తీసుకెళ్లొచ్చు. బ్యాంక్ ఆఫర్లు, EMI ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఆఫీసులకు, స్కూల్స్ కి రోజువారీ ప్రయాణాలు చేసే వారికి ఈ కారు బాగుంటుంది. అంతే కాకుండా చిన్న వ్యాపారాల కోసం సరుకులు తీసుకెళ్లేవారు కూడా ఈ కారును కన్వీనియంట్ గా వాడుకోవచ్చు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే సిటీస్ లో ఈ చిన్న కారు బాగా ఉపయోగపడుతుంది. 

Latest Videos

click me!