WhatsAppలో కొత్త అప్‌డేట్.. సీక్రెట్‌గా చాటింగ్ చేసేయండి

First Published | Nov 16, 2024, 5:19 PM IST

మీరు మీ సీక్రెట్ ఫ్రెండ్ తో చాట్ చేస్తున్నారా? అది ఎవరికీ తెలియకూడదని అనుకుంటున్నారా? అయితే WhatsAppలో కొత్తగా వచ్చిన ఈ ఫీచర్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది. వాట్సాప్ లో చాట్‌లను సురక్షితంగా ఉంచుకోవడానికి ఇటీవలే ‘చాట్ లాక్’ ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. ఇది మీ ప్రైవసీని కాపాడుతుంది. ఇతరులు మీ చాట్ లను చూడకుండా, మీ ప్రైవేటు విషయాలు తెలుసుకోకుండా కాపాడుతుంది. 

స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ WhatsApp ఉపయోగిస్తారు. ప్రతి రోజు గుడ్ మార్నింగ్ మెసేజ్ ల నుంచి మొదలై ఎన్నో విషయాలు వాట్సాప్ లో షేర్ అవుతుంటాయి. ఇటీవల కమ్యూనిటీస్ అనే ఆప్షన్ కూడా వినియోగదారులకు ఎంతో ఉపయోగంగా ఉంటోంది. స్టేటస్ ఆప్షన్ ని అప్ డేట్ లని మార్చారు. అందులో  ఛానల్స్ అనే ఆప్షన్ ప్రపంచ సమాచారాన్ని ఒక్క క్లిక్ తో అందిస్తోంది. ఇందులో ఉండే రకరకాల గ్రూప్ లు వివిధ రకరకాల సమాచారాన్ని క్షణాల్లో అందిస్తున్నాయి. ఇవి కాకుండా చాట్ లో ఎలాగో లోకల్ గ్రూప్ లు ఉండనే ఉన్నాయి. ఇలా వాట్సాప్ ఒకటే అన్ని రకాలుగా ఉపయోగపడుతోంది. 

WhatsApp ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ కొత్త ఫీచర్స్ ను వినియోగదారులకు అందిస్తోంది. ఇప్పుడు కొత్తగా చాట్‌లను సురక్షితంగా ఉంచుకోవడానికి చాట్ లాక్ ఫీచర్ తీసుకొచ్చింది. ఈ ఆప్షన్ ఉపయోగించి మీరు మీ ప్రైవేట్ చాట్‌లను లాక్ చేయవచ్చు. ఒక సీక్రెట్ కోడ్‌ను క్రియేట్ చేసుకొని మీ ప్రైవేట్ చాట్ ని రహస్యంగా దాచుకోవచ్చు. లాక్ చేసిన చాట్‌లను 'లాక్డ్ చాట్స్' సెక్షన్‌లో చూడవచ్చు.

చాట్ లాక్ ఫీచర్‌ని ఉపయోగిస్తే లాక్ చేసిన చాట్స్ అన్నీ  'లాక్డ్ చాట్స్' సెక్షన్‌లో ఉంటాయి. ఇక్కడే సీక్రెట్ కోడ్ ఉపయోగపడుతుంది. లాక్ చేసిన మెసేజ్‌లను సీక్రెట్ కోడ్ ఎలా ప్రొటెక్ట్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం.

Latest Videos


WhatsAppలోని సీక్రెట్ కోడ్ ఫీచర్, 'లాక్డ్ చాట్స్' సెక్షన్‌కి ప్రత్యేక పాస్‌వర్డ్ పెట్టుకోవాలి. లాక్ చేసిన చాట్‌లకి వేరే పేరు పెట్టుకోవచ్చు. ఈ సెక్షన్‌ని యాప్‌లో కనిపించకుండా దాచవచ్చు. దీంతో ఇతరులు లాక్ చేసిన చాట్‌లను చూడలేరు. ప్రైవసీ కోరుకొనే వారికి ఈ ఆప్షన్ ఎంతో ఉపయోగపడుతుంది. ఇది చాలా సెక్యూర్ గా కూడా ఉంటుంది. ఇప్పటికే వాట్సాప్ మెసేజ్ లను ఎక్రిప్ట్ చేస్తోంది. అందువల్ల మీ ప్రైవసీకి ఎలాంటి ఇబ్బంది రాదు. 

లాక్ చేసిన చాట్‌లకు సీక్రెట్ కోడ్ ఇచ్చాక వాటిని చూడాలంటే ఆ కోడ్ ఎంటర్ చెయ్యాలి. తప్పు కోడ్ ఎంటర్ చేస్తే లాక్ చేసిన చాట్‌లను చూడలేరు. 

WhatsApp సీక్రెట్ కోడ్ వాడే ముందు ఒక విషయం గుర్తుంచుకోవాలి. లాక్ చేసిన చాట్‌లను చూడటం కష్టం. మీరే చూడాలన్నా ప్రతిసారి సీక్రెట్ కోడ్ టైప్ చెయ్యాలి.

మీ WhatsApp సీక్రెట్ కోడ్ ఎవరికైనా తెలిస్తే వాళ్ళు లాక్ చేసిన చాట్‌లను చూడగలరు. సీక్రెట్ కోడ్ మర్చిపోతే ఆ చాట్‌లను రికవర్ చెయ్యడం చాలా కష్టం అవుతుంది. అందువల్ల లాక్ చాట్ ఆప్షన్ ను జాగ్రత్తగా ఉపయోగించుకోండి. 

click me!