రోల్స్ రాయిస్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్న కారు కేవలం రూ.14 లక్షలే..

First Published | Nov 16, 2024, 10:39 AM IST

కారు వాడేది అవసరాల కోసమే అయినా సేఫ్టీ చాలా ముఖ్యం కదా.. సాధారణంగా బాగా ఖరీదైన కార్లలో రక్షణ కల్పించే సౌకర్యాలు ఎక్కువగా ఉంటాయి. కాని ఇండియాకు చెందని ఓ కారు అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ కారులో ఉండే సేఫ్టీ ఫెసిలిటీస్ ను అందిస్తోంది. రోల్స్ రాయిస్ తో పోలిస్తే ఈ కారు ధర చాలా తక్కువ. మరి ఆ కారు ఏంటి? ఎలాంటి భద్రతా సౌకర్యాలు కల్పిస్తోందో ఇక్కడ తెలుసుకుందాం. 

భారతీయ వాహన తయారీ కంపెనీల కార్లలో రోల్స్ రాయిస్ లాంటి లగ్జరీ లుక్ మరే ఇతర కార్లకు రాదు. అదేవిధంగా భద్రత, ప్రాణాలకు రక్షణ కల్పించడంలోనూ రోల్స్ రాయిస్ బెస్ట్ అని అందరూ చెబుతారు. అలాంటి భద్రత, లగ్జరీ కార్లను భారతీయ వాహన తయారీదారుల నుండి పొందాలనుకునే వారికి టాటా హారియర్ ఎస్‌యూవీ ఒక చక్కటి ఎంపిక.

టాటా హారియర్ ఎస్‌యూవీ దాని ట్యాంక్ లాంటి నిర్మాణం, అత్యుత్తమ భద్రతా లక్షణాల వల్ల భారతీయ మార్కెట్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం ఇది భారతదేశంలో అత్యంత భద్రమైన కార్లలో ఒకటిగా నిలిచింది. ఈ కారును రోల్స్ రాయిస్ భద్రతా ప్రమాణాలతో పోల్చవచ్చని తెలిపింది.

రోల్స్ రాయిస్ అనేది సాటిలేని లగ్జరీ కారు. ఆ కంపెనీ భద్రతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. దీన్ని తరచుగా ఇంజనీరింగ్, డిజైన్ పరంగా విమానంతో పోలుస్తారు. భారతదేశంలో ఫాంటమ్(Phantom), ఘోస్ట్(Ghost), కల్లీనన్(Cullinan) వంటి రోల్స్ రాయిస్ మోడల్స్ బాగా ఫేమస్ అయ్యాయి. 

అంతేకాకుండా స్పోర్ట్స్ కూపే డిజైన్‌తో ఫాస్ట్ గా, స్టైలిష్ గా ఉండే రైత్(Wraith), డాన్(Dawn) మోడల్స్ కూడా ఈ కంపెనీకి చెందిన కార్లే. అన్ని కార్లు పవర్‌ఫుల్ V12 ఇంజిన్‌తో తయారవుతాయి. 0-100 కిమీ/గం వేగాన్ని కేవలం 5-6 సెకన్లలో చేరుతుంది. 563 hp నుండి 600+ hp పవర్ వీటి సొంతం. ఈ కార్ల ప్రారంభ ధర రూ.6 కోట్ల నుండి రూ.10 కోట్ల వరకు ఉంటుంది. రోల్స్ రాయిస్ Spectre అనే కొత్త ఎలక్ట్రిక్ కార్ ని విడుదల చేయనుంది. ఇది పూర్తి లగ్జరీతో నిండిన ఫస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ అవుతుంది. 


నవంబర్ 11, 2024న విడుదలైన ఫోర్బ్స్ నివేదిక ప్రకారం టాటా హారియర్ భారతదేశంలోని అత్యంత భద్రమైన కార్ల జాబితాలో అగ్రస్థానంలో ఉంది. గ్లోబల్ NCAP క్రాష్ పరీక్షలలో ఇది అత్యధిక రేటింగ్‌ను పొందింది.

టాటా మోటార్స్ నుండి వచ్చిన ప్రీమియమ్ SUV టాటా హారియర్ కారు. దాని ఆకర్షణీయమైన డిజైన్, శక్తివంతమైన పనితీరు, అధునాతన ఫీచర్లతో మార్కెట్‌లో ఎంతో పేరుపొందింది. డిజైన్ పరంగా చూస్తే ఓమెగా ఆర్కిటెక్ట్ (OMEGA Arc) డిజైన్ టాటా హారియర్ కి లగ్జరీ లుక్ తీసుకువచ్చింది. బోల్డ్ ఫ్రంట్ గ్రిల్, LED DRLs, ప్రోజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, డైనమిక్ షార్క్ ఫిన్ డిజైన్ తో ఈ కారు చూడటానికి చాలా రిచ్ లుక్ ను కలిగి ఉంటుంది. డ్యూయల్ టోన్ రంగులతో ఇది మార్కెట్ లో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. 

టాటా హారియర్ 1956cc డిస్ప్లేస్‌మెంట్ కలిగిన శక్తివంతమైన 2.0 లీటర్ Kryotec డీజిల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఈ పవర్‌హౌస్ 167.62 bhp, 350Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మాన్యువల్ గా, ఆటోమెటిక్ గా ఆరు గేర్లతో నడుస్తుంది. మీరు ఎలా కావాలంటే అలా దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు.  

ఇన్‌టీరియర్ ప్రీమియం ఫినిష్‌తో లగ్జరీగా ఉంటుంది. 9 స్పీకర్ JBL సౌండ్ సిస్టమ్ మీరు మైమరచిపోయే సంగీతాన్ని అందిస్తాయి. పనోరమిక్ సన్‌రూఫ్, ఏరో ఎలిమెంట్స్, ఎయిర్ ప్యూరిఫయర్, అడ్వాన్స్ క్లైమేట్ కంట్రోల్ ఇందులో ప్రత్యేక ఫీచర్స్. 
 

ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్స్ ఉన్నాయి. భదత్రకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. డ్రైవింగ్ లో మీకు సపోర్ట్ గా ఉండటానికి ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్, హిల్ డిసెంట్ కంట్రోల్ అనే ఆప్షన్లు ఉన్నాయి. 360 డిగ్రీ కెమెరా, ఆడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ ప్రత్యేక ఫీచర్లు. టాటా హారియర్ లో అనేక వేరియంట్లు ఉన్నాయి. అవి XE, XM, XT, XZ, XZ+.

టాటా హారియర్ వివిధ అవసరాలకు, బడ్జెట్‌లకు అనుగుణంగా అనేక వేరియంట్‌లలో లభిస్తుంది. బేస్ మోడల్ ధర రూ.14.86 లక్షలు. ఫుల్‌గా లోడ్ అయిన టాప్ వేరియంట్ రూ.25.89 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ధర ఉంది. 

Latest Videos

click me!