UPI ట్రాన్సాక్షన్స్ మన డైలీ లైఫ్ లో ఊహించని మార్పులు తెచ్చాయి. చిన్న చిన్న దుకాణాల నుండి పెద్ద పెద్ద మాల్స్ వరకు మనం కొనుగోలు చేసే వస్తువులకు UPI ద్వారా డబ్బులు కడుతున్నాం కదా.. అదేవిధంగా మరొకరికి డబ్బు పంపాలంటే కూడా అతని మొబైల్ నంబర్ లేదా UPI ID కచ్చితంగా ఉండాలి. అప్పుడు మాత్రమే సులభంగా డబ్బు పంపవచ్చు.
అయితే ప్రతి UPI లావాదేవీకి 4 నుంచి 6 అంకెల UPI పిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ పిన్‌ను సెట్ చేయడానికి డెబిట్ కార్డు అవసరం. కానీ డెబిట్ కార్డు లేకుండానే ఇప్పుడు UPI పిన్‌ను సెట్ చేయవచ్చు. అదెలాగో ఇక్కడ చూద్దాం.
గతంలో UPI పిన్ క్రియేట్ చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది. ఇప్పడు పిన్ జనరేట్ చేయడానికి చాలా మార్గాలు వచ్చేశాయి. వాస్తవానికి డెబిట్ కార్డుపై ఉండే కార్డు నంబర్, ఎక్స్‌పైరీ డేట్ ఎంటర్ చేస్తేనే UPI పిన్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు డెబిట్ కార్డు లేకుండానే UPI పిన్‌ను సెట్ చేసే సులభమైన మార్గాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అందించింది.
UPI పిన్‌ను ఎలా సెట్ చేయాలి?
UPI పిన్‌ను సెట్ చేయడానికి రెండు మార్గాలు ఉన్నాయి.
1. డెబిట్ కార్డును ఉపయోగించడం
డెబిట్ కార్డు ఉపయోగించి UPI పిన్ క్రియేట్ చేసేటప్పుడు కార్డు నంబర్, కార్డు ఎక్స్పైరీ డేట్, అకౌంట్ హోల్డర్ పేరు ఇలాంటి మరిన్ని వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.
2. ఆధార్ OTPని ఉపయోగించి డెబిట్ కార్డు లేకుండా మీ UPI పిన్ సెట్ చేసుకోవచ్చు.
ముందుగా మీరు మీ మొబైల్ నంబర్ మీ ఆధార్ కార్డుతో లింక్ అయ్యిందో లేదో చెక్ చేసుకోండి. మీ మొబైల్ నంబర్ మీ బ్యాంక్ అకౌంట్ ను అనుంధానించారో లేదో కూడా పరిశీలించాలి.
డెబిట్ కార్డు లేకుండా UPI పిన్‌ను ఎలా సెట్ చేయాలి?
మీ ఆధార్‌ను ఉపయోగించి UPI పిన్‌ను సెట్ చేయడానికి, ఈ సులభమైన స్టెప్స్ ఇక్కడ ఉన్నాయి.
1. మీ UPI యాప్‌ను ప్రారంభించి, మీ బ్యాంక్ ఖాతా వివరాలను నమోదు చేయండి.
2. తర్వాత UPI పిన్ సెట్టింగ్‌ను ఎంచుకోండి. మీ UPI పిన్‌ను సెట్ చేయడానికి ఎంపికను ఎంచుకోండి.
3. ఆపై 'ఆధార్' సెలెక్ట్ చేసి మీ పర్మీషన్స్ ఓకే చేయండి.
4. తర్వాత మీ ఆధార్ నంబర్ లో మొదటి ఆరు అంకెలను నమోదు చేయండి.
5. మీ ఆధార్‌తో లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. దాన్నిఎంటర్ చేయండి.
6. తర్వాత కొత్త UPI పిన్‌ను క్రియేట్ బటన్ పై క్లిక్ చేయండి.
7. సెట్టింగ్‌ను పూర్తి చేయడానికి OTPని, మీ UPI పిన్‌ను మళ్ళీ ఎంటర్ చేయండి.
పైన పేర్కొన్న ఈ సులభమైన స్టెప్స్ అనుసరించడం ద్వారా డెబిట్ కార్డు అవసరం లేకుండా మీ UPI పిన్‌ను విజయవంతంగా జనరేట్ చేయవచ్చు. ఇప్పుడు మీరు అంతరాయం లేని UPI లావాదేవీలను సులభంగా చేయవచ్చు. ఈ గైడ్‌ని అనుసరించడం ద్వారా మీ UPI పిన్‌ను త్వరగా సెట్ చేసి మీ మొబైల్ నంబర్, ఆధార్‌ను ఉపయోగించి క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్ సులభంగా చేయండి.