Document Scanner: వాట్సాప్‌లో డాక్యుమెంట్స్ స్కాన్ చేస్తే సమాచారం లీకవుతుందా? ఎలాంటి స్కానర్లు సురక్షితమో తెలుసా?

Published : Jul 05, 2025, 12:42 PM IST

డిజిటల్ డాక్యుమెంట్ స్కానర్ల ద్వారా మోసాలు పెరుగుతున్నాయి. అందుకే ముఖ్యమైన డాక్యుమెంట్స్ ని స్కాన్ చేయాలంటే చాలా మంది భయపడుతుంటారు. ఎక్కువ మంది వాట్సాప్ స్కానర్ వాడుతుంటారు. ఇది సురక్షితమేనా? ఎలాంటి యాప్స్ డేంజరో ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
స్కానర్ యాప్‌లు సురక్షితమేనా?

ఈ డిజిటల్ యుగంలో డాక్యుమెంట్‌లను స్కాన్ చేసి ఇతరులతో షేర్ చేయడం చాలా సాధారణం. వాట్సాప్‌లో ఉన్న "Document Scanner" ఫీచర్ ను ఎక్కువ మంది ఉపయోగిస్తూ డాక్యుమెంట్స్ షేర్ చేస్తారు. ఇది చాలా సింపుల్ గా కూడా ఉంటుంది. కానీ దీని భద్రత గురించి చాలా మందికి సందేహాలు ఉన్నాయి. 

అలాగే మార్కెట్లో అందుబాటులో ఉన్న కొన్ని స్కానర్ యాప్‌లు సురక్షితం కాదన్నది అందరికీ తెలిసిన నిజం. కాని తప్పని పరిస్థితుల్లో వాటిని ఉపయోగించాల్సి వస్తుంది. ముఖ్యంగా కొన్ని చైనీస్ యాప్‌లు భద్రతా సమస్యల కారణంగా భారతదేశంలో వాటిని నిషేధించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. 

25
వాట్సాప్ డాక్యుమెంట్ స్కానర్ సురక్షితమే

వాట్సాప్ లో ఉన్న ఇన్‌బిల్ట్ డాక్యుమెంట్ స్కానర్ End-to-End Encryption (E2EE) భద్రతతో పనిచేస్తుంది. అంటే మీరు స్కాన్ చేసి పంపే డాక్యుమెంట్‌ల కంటెంట్ మీ ఫోన్‌లో, రిసీవర్ ఫోన్‌లో మాత్రమే అర్థమవుతుంది. WhatsApp మీ డాక్యుమెంట్‌ను సేవ్ చేయదు. స్కాన్ చేసిన చిత్రాలను క్లౌడ్‌లో కూడా సేవ్ చేయదు. కాబట్టి డేటా వాట్సాప్ సర్వర్‌లో స్టోర్ అవ్వదు. 

అయితే మీ ఫోన్‌లో వైరస్ లేదా మాల్వేర్ ఉంటే స్కాన్ చేసిన ఫైల్‌లను ఇతరులు చూడటం, యాక్సిస్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మీ మొబైల్ భద్రత చాలా ముఖ్యం.

35
ఇలాంటి చైనా కంపెనీ స్కానర్ యాప్ లతో జాగ్రత్త

కొన్ని స్కానర్ యాప్‌లు సురక్షితం కావు. ఎందుకంటే అవి మీ డాక్యుమెంట్‌లను థర్డ్ పార్టీలతో పంచుకునే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఈ క్రింది యాప్‌లను మీ ఫోన్ లో ఉంటే నివారించాలి.

CamScanner (పాత వెర్షన్లు): ఇది ఒక చైనీస్ కంపెనీ అభివృద్ధి చేసిన యాప్. దీని పాత వెర్షన్లలో ట్రోజన్ మాల్వేర్ ఉందని Play Store నుండి దీన్ని తొలగించారు. ఇప్పుడు అది తిరిగి వచ్చినప్పటికీ చాలా మంది ఇప్పటికీ దాన్ని నమ్మకం లేదు.

TurboScan: ఈ యాప్ ప్రైవేట్ సర్వర్‌ను ఉపయోగిస్తుంది. అందువల్ల ఇది సురక్షితం కాదు. క్లౌడ్‌లో డాక్యుమెంట్‌లను సేవ్ చేసే యాప్‌లను ఉపయోగించకపోవడమే మంచిది.

Fast Scanner, TapScanner: ఈ యాప్‌లలో కొన్ని వెర్షన్లు మీరు స్కాన్ చేసిన డాక్యుమెంట్‌లను థర్డ్ పార్టీ యాడ్ సర్వర్‌కు పంపే అవకాశం ఉందని భద్రతా అధ్యయనాలు హెచ్చరించాయి.

Scanner Go: ఈ యాప్ లోని కొన్ని వెర్షన్లు చైనాలో తయారయ్యాయి. ఇవి కూడా నమ్మదగినవి కావు.

45
ఇవి సురక్షితమైన స్కానర్ యాప్‌లు

Adobe Scan: ఇది US బేస్‌డ్ స్కానర్ యాప్. ఇది మీ డేటాను ఎక్కడా స్టోర్ చేయదు. అందువల్ల ఇది వాడటం సురక్షితమే. 

Microsoft Lens: మైక్రోసాఫ్ట్ తయారు చేసిన ఈ యాప్ కూడా యూజర్లకు సురక్షితమైన స్కానింగ్ సౌకర్యాన్ని అందిస్తోంది. ఇందులో క్లౌడ్ ఇంటిగ్రేషన్ ఉంది. అయినప్పటికీ ఇది సురక్షితమే.

Google Drive: గూగుల్ డ్రైవ్ లో ఇన్‌బిల్ట్ గా ఉన్న స్కానర్ ను ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు నిర్భయంగా ఉపయోగించవచ్చు. దీని వల్ల పెద్దగా సమస్యలు ఏమీ రావు. 

Genius Scan: యూరప్ బేస్డ్ స్కానర్ యాప్ ఇది. ఇది డేటా ను లోకల్ స్టోరేజ్ మాత్రమే చేస్తుంది. అందువల్ల పెద్దగా సమస్యలు రావు.

55
సేఫ్ స్కానర్ యాప్ ను మీరే ఎంచుకోండి

WhatsApp స్కానర్ ఒక నమ్మకమైన, సురక్షితమైన స్కానర్ యాప్. దీంతో ఎలాంటి సమస్య రాదు. కానీ మీకు క్లౌడ్ కౌంటింగ్ స్కాన్ అవసరమైతే Adobe Scan లేదా Microsoft Lens వంటివి సురక్షితమై యాప్ లను ఎంచుకోవడం మంచిది. CamScanner వంటి పాత చైనీస్ యాప్‌లను ఉపయోగించకపోవడమే మంచిది. మీరు స్కానర్ యాప్ ఉపయోగించే ముందు దానికి ఉన్న పర్మీషన్లు, డేటా వినియోగ విధానం వంటి వాటిని చూసి మీ వ్యక్తిగత సమాచారాన్ని రక్షించే యాప్‌ అయితేనే ఉపయోగించండి. 

Read more Photos on
click me!

Recommended Stories