Apartment: అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొంటున్నారా.? అయితే ఇది తెలుసుకోండి..

Published : Mar 16, 2026, 10:00 AM IST

Apartment: చాలామంది అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొనేటప్పుడు కేవలం బిల్డప్ ఏరియా లేదా కార్పెట్ ఏరియా గురించి మాత్రమే ఆలోచిస్తారు. కానీ, అపార్ట్‌మెంట్‌తో పాటు మీకు భూమిలో కూడా వాటా లభిస్తుంది. దీనినే Undivided Share (UDS) అంటారు. 

PREV
15
అపార్ట్‌మెంట్ కొంటున్నారా?

సాధారణంగా ఒక అపార్ట్‌మెంట్ నిర్మించిన మొత్తం స్థలంలో, ప్రతి ఫ్లాట్ యజమానికి కొంత భూమి వాటాగా కేటాయింస్తారు. భవిష్యత్తులో 40 లేదా 50 ఏళ్ల తర్వాత ఆ అపార్ట్‌మెంట్ పాతబడి కూల్చివేసినప్పుడు లేదా రీ-డెవలప్‌మెంట్‌కు వెళ్లినప్పుడు, మీకు వచ్చే పరిహారం లేదా కొత్త ఫ్లాట్ పరిమాణం ఈ UDS పైనే ఆధారపడి ఉంటుంది.

25
UDS అంటే ఏంటో తెలుసుకోకపోతే..

ఉదాహరణకు, మీకు 50 గజాల UDS ఉంటే, రీ-డెవలప్‌మెంట్ సమయంలో మీకు ఆ 50 గజాల విలువైన వాటా లభిస్తుంది. రిజిస్ట్రేషన్ సమయంలో డాక్యుమెంట్లలో UDS ఖచ్చితంగా ఎంత ఉందో చూసుకోవాలి.

35
UDS అంటే ఏమిటి

ఒక అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ నిర్మించిన మొత్తం భూమిని, అక్కడ ఉన్న ఫ్లాట్‌ల సంఖ్య, వాటి వైశాల్యం ఆధారంగా విభజిస్తారు. ఈ భూమిపై మీకు ఉండే హక్కునే UDS అంటారు. అంటే, అపార్ట్‌మెంట్ ఉన్న భూమిలో మీకు విడిగా ఏ ముక్కను కేటాయించరు కానీ, మొత్తం స్థలంలో మీకు కొంత శాతం వాటా ఉంటుంది.

45
దీని ప్రాముఖ్యత ఏమిటి?

అపార్ట్‌మెంట్ కాలపరిమితి ముగిసిన తర్వాత(సుమారు 50 ఏళ్లకు), ఆ భవనాన్ని కూల్చివేసి కొత్తది కట్టాలనుకున్నప్పుడు, పాత ఫ్లాట్ యజమానులకు వారికున్న UDS ప్రకారమే కొత్త ఫ్లాట్‌లు లేదా నగదు పరిహారం అందుతుంది. మీరు ఫ్లాట్ అమ్మేటప్పుడు కేవలం ఇంటి విస్తీర్ణం మాత్రమే కాదు, మీకు ఎంత భూమి వాటా ఉందనేది కూడా ఆస్తి విలువను పెంచుతుంది. బ్యాంకులు హోమ్ లోన్ ఇచ్చేటప్పుడు, ఆస్తి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు UDS డాక్యుమెంట్లను నిశితంగా పరిశీలిస్తాయి.

55
కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

బిల్డర్లు కొన్నిసార్లు ఎక్కువ ఫ్లాట్లు అమ్మడం కోసం UDS ను తగ్గించే అవకాశం ఉంటుంది. కాబట్టి, మీరు కొనే ఫ్లాట్ కార్పెట్ ఏరియాతో పాటు, మీకు రిజిస్టర్ అవుతున్న భూమి వాటా(UDS) ఎన్ని గజాలు ఉందో తప్పనిసరిగా సరిచూసుకోవాలి. తక్కువ UDS ఉంటే భవిష్యత్తులో మీకు దక్కే లాభం తగ్గుతుంది. అందుకే అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసేటప్పుడు దీని గురించి ఆరా తీయడం మర్చిపోకండి.

Read more Photos on
click me!

Recommended Stories