Bank Locker: కొందరు బంగారం, ఆభరణాలు లాంటి విలువైన వస్తువులను బ్యాంక్ లాకర్లలో ఉంచుతారు. లాకర్ కోసం డబుల్ కీలు ఉంటాయి. ఒక కీని బ్యాంకు ఉంచుకుంటుంది. మరొక కీని కస్టమర్‌కు ఇస్తుంది. ఒక కీ పోతే, లాకర్ తెరవలేం.
చాలామంది విలువైన బంగారు ఆభరణాలు, ముఖ్యమైన పత్రాలను బ్యాంకు లాకర్లలో ఉంచుతారు. ఎందుకంటే అవి ఇంట్లో ఉంచితే ఎక్కడ దొంగలిస్తారా అని భయం. ఒక కస్టమర్ తమ లాకర్ కీని పోగొట్టుకుంటే ఏమి జరుగుతుంది.? బ్యాంకు వద్ద డూప్లికేట్ కీ ఉందా.? లాకర్ తెరిచే ప్రక్రియ ఏమిటి మొదలైనవి ఇక్కడ చూసేద్దాం..
25
బ్యాంకు లాకర్లకు రెండు కీలు
బ్యాంకు లాకర్లకు రెండు కీలు ఉంటాయి. ఒక కీ కస్టమర్‌కు ఇస్తారు. మరొక కీ బ్యాంకులో ఉంటుంది. ఈ రెండు కీలు భిన్నంగా ఉంటాయి. లాకర్‌ను తెరవడానికి ఈ రెండు కీలు అవసరం. ఒకే కీ లాకర్‌ను తెరవలేరు. అందువల్ల, ఒక కస్టమర్ కీని పోగొట్టుకున్నప్పుడు, దానిని తెరవడానికి ఏకైక మార్గం లాకర్‌ను పగలగొట్టడం. మరి అది ఎలా..
35
లాకర్ కీని పోగొట్టుకున్నప్పుడు
ముందుగా, మీరు మీ లాకర్ కీని పోగొట్టుకున్నప్పుడు, మీరు వెంటనే ఆ బ్యాంకు శాఖకు వెళ్లి అధికారికంగా లెటర్ ఇవ్వాలి. మీరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, లాకర్ కీ దొంగలించారని ఫిర్యాదు చేయాలి. దాని కాపీని తీసుకోవాలి. తరువాత, బ్యాంకుకు వెళ్లి, లాకర్ కీ పోయిందని పేర్కొంటూ బ్యాంకులో పోలీసులకు ఫిర్యాదు చేసిన లెటర్ సబ్మిట్ చేయాలి.
బ్యాంకు మీ నుంచి ఒక అండర్ టేకింగ్ పొందవచ్చు. పోలీసు ఫిర్యాదుతో పాటు, బ్యాంకు ఆధార్, పాన్ కార్డ్ లాంటి పత్రాలను కూడా అడగవచ్చు. ఉమ్మడి ఖాతా అయితే, ఖాతాదారులందరూ బ్యాంకుకు వెళ్లి ఫిర్యాదుపై సంతకం చేయాలి. దీని తరువాత, లాకర్‌ను బద్దలు కొట్టే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ పనికి బ్యాంకు ఒక సమయాన్ని నిర్దేశిస్తుంది.
55
అన్ని ఖర్చులను..
ఆ సమయంలో, ఖాతాదారుడు లేదా ఖాతాదారులు తప్పనిసరిగా వెళ్లాలి. ఖాతాదారుడు, బ్యాంకు అధికారి సమక్షంలో ఒక నిపుణుడు లాకర్‌ను బద్దలు కొడతాడు. తరువాత, ఒక కొత్త లాకర్‌ను ఇన్‌స్టాల్ చేసి, కస్టమర్‌కు కొత్త కీని ఇస్తారు. బ్యాంకు లాకర్‌ను పగలగొట్టడం నుంచి కొత్త లాకర్‌ను ఇన్‌స్టాల్ చేయడం వరకు అన్ని ఖర్చులను కస్టమర్ భరించాల్సి ఉంటుంది.