Cheapest Alcohol: మద్యం ధరలు ప్రతి ఏటా పెరుగుతూనే ఉన్నాయి. అయితే ప్రపంచంలోని కొన్ని దేశాల్లో మాత్రం మద్యం చవకగా దొరుకుతుంది. ఒక బ్రాండెడ్ మద్యం బాటిల్ కేవలం రూ.45 నుంచి రూ.75లోపే లభిస్తుంది. ఏ దేశాల్లో ఇంత తక్కువ ధరకు మద్యం లభిస్తుందో తెలసుకోండి.
మనదేశంలో మద్యపాన ప్రియులు ఎక్కువ. ప్రతి రోజూ ఆల్కహాల్ తాగనిదే కనీసం నిద్రపోరు. అంతగా మద్యపానానికి బానిసలుగా మారిపోయారు. ఎంతో మంది మద్యం తాగడాన్ని ఆస్వాదిస్తారు. కానీ మద్యం ధరల పెరుగుదలతో దాని కోసం అప్పులు చేసే వారి సంఖ్య అధికంగా ఉంది. మనదేశంలో బ్రాండెడ్ మద్య బాటిల్ కొనాలంటో వందల్లో, కొన్నిసార్లు వేలల్లో ఖర్చుపెట్టాల్సి వస్తుంది.
24
మద్యం ధరలు అధికంగా ఉండే దేశాలు
మద్యం బాటిల్ ధరలు దేశ పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటాయి. కొన్ని దేశాల్లో మద్యం చాలా ఖరీదైన పానీయం. కొన్ని దేశాల్లో మాత్రం చాలా తక్కువ ధరకు లభిస్తుంది. ప్రభుత్వాలు మద్యంపై వేసే పన్నులు ఆధారంగా మద్యం ధరలు నిర్ణయిస్తారు. నార్వే, ఐస్లాండ్, ఫిన్లాండ్ వంటి దేశాల్లో మద్యం ధరలు అధికంగా ఉంటాయి. ఎందుకంటే ఆ దేశాల్లోని ప్రభుత్వాలు భారీగా పన్నులు వేశాయి. ఆరోగ్య సమస్యలను తగ్గించేందుకు ఇలా భారీ పన్నులు వేసినట్టు చెబుతారు. ఇప్పుడు మద్యం ప్రియుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మీ స్నేహితులలో కనీసం ఒక్కరైనా మద్యం తాగే వ్యక్తి ఉంటారు.
34
చీప్ లిక్కర్ తాగుతూ
కొన్ని యూరోపియన్ దేశాలు, అమెరికా లాంటి దేశాల్లో మాత్రం మద్యం ధరలు మధ్యస్థంగా ఉంటాయి. మరీ తక్కువ కాకుండా, అలా అని మరీ ఎక్కువ కాకుండా ఉంటాయి. ఇక మనదేశంలో మద్యం ధరలు రాష్ట్రాల వారీగా మారుతాయి. మద్యంపై పన్నులు విధించే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటుంది. కాబట్టి మద్యం బాటిల్ ధర ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో చాలా ఖరీదుగా కూడా ఉండవచ్చు. గోవాలో మాత్రం మద్యం ధరలు చాలా తక్కువగా ఉంటాయి. అదే కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో మద్యం ధరలు ఎక్కువగా ఉంటాయి.
కొంతమంది 100 రూపాయల కన్నా తక్కువ ధరకు లభించే మద్యాన్ని తాగుతారు. నిజానికి అది చీప్ లిక్కర్. దీన్ని తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. కొందరు ధనవంతులు మాత్రం లక్షల రూపాయల విలువైన బాటిల్‌ను కొని మద్యం తాగుతూ ఉంటారు. కానీ మనదేశంలో విపరీతంగా మద్యం ధరలు పెరిగిపోతున్నాయి. అయినా తాగే వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు.
ప్రపంచంలో మద్యం చాలా చవకగా దొరికే కొన్ని దేశాలు ఉన్నాయి. ఈ దేశాలలో వియత్నాం మొదటి స్థానంలో ఉంటుంది. ఈ దేశంలో కేవలం 45 రూపాయలకే మద్యం బాటిల్ కొనుగోలు చేసుకోవచ్చు. ఇక ఆఫ్రికా దేశమైన జాంబియాలో కూడా మద్యం ధర చాలా చవగా దొరుకుతుంది.
ఇక జాంబియాలో మద్యం బాటిల్ ధర కేవలం 75 రూపాయలు. ఉక్రెయిన్, వెనిజులా వంటి దేశాల్లో కూడా మద్యం చాలా తక్కువ ధరకే లభిస్తుంది. అక్కడ మద్యం తయారుచేసే పద్ధతి, ఖర్చు తక్కువగా ఉండటం వల్ల అక్కడ మద్యం తక్కువ ధరకే లభిస్తుంది.