VinFast EV: ఇండియాలోకి వియత్నాం ఎలక్ట్రిక్ కార్లు.. లుక్ అదిరిపోయిందిగా..

Published : Feb 05, 2025, 07:49 PM IST

VinFast EV: ఇండియన్ మార్కెట్ ను క్యాష్ చేసుకోవాలని ప్రపంచ దేశాల్లోని అనేక కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా వియత్నాం దేశానికి చెందిన వింఫాస్ట్ కంపెనీ కూడా తమ కార్లను ఇండియాలో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. మరి ఆ కంపెనీ తయారు చేసిన కార్ల గురించి ఆసక్తికర వివరాలు తెలుసుకుందాం రండి. 

PREV
14
VinFast EV: ఇండియాలోకి వియత్నాం ఎలక్ట్రిక్ కార్లు.. లుక్ అదిరిపోయిందిగా..

వియత్నాం ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ వింఫాస్ట్ 2025 జనవరిలో జరిగిన 2025 భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో తన లేటెస్ట్ కార్ల ఉత్పత్తులను ప్రదర్శించింది. ఈ దీపావళికి VF6, VF7 అనే రెండు ప్రీమియం ఎలక్ట్రిక్ SUVలతో భారతదేశంలో తన వ్యాపార ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నట్లు వింఫాస్ట్ సంస్థ వెల్లడించింది.

2026లో VF3 అనే చవకైన కారును కూడా విడుదల చేస్తామని వింఫాస్ట్ ఇండియా ఆపరేషన్స్ CEO ఫామ్ సాన్ చౌ ప్రకటించారు. రాబోయే వింఫాస్ట్ ఎలక్ట్రిక్ SUVల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

24

వింఫాస్ట్ VF3

VF3 రెండు డోర్లతో వస్తున్న తక్కువ ధర కలిగిన కారు. ఇది 2023లో మొదటి మోడల్ తయారైంది. గత సంవత్సరం ఈ కార్ల ప్రొడక్షన్ ప్రారంభమైంది. ఇందులో 18.64 kWh లిథియం-అయాన్ ఫాస్ఫేట్ బ్యాటరీ, 44bhp ఎలక్ట్రిక్ మోటార్ ఉన్నాయి. ఈ చిన్న ఎలక్ట్రిక్ కారు ప్రత్యేకంగా సిటీస్ లో తిరగడానికి డిజైన్ చేశారు. ఈ బుల్లి కారు గంటకు 100 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. పూర్తిగా ఛార్జ్‌ చేస్తే 210 కి.మీ వరకు వెళ్తుంది. ఇది 3,190 mm పొడవు, 1,679 mm వెడల్పు, 1,622 mm ఎత్తు, 2,075 mm వీల్‌బేస్ కలిగి ఉంది.

34

వింఫాస్ట్ ఫ్యాక్టరీ

వింఫాస్ట్ VF6 మోడల్ కారు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో అమ్ముడవుతోంది. ఈ కారు 59.6 kWh బ్యాటరీని కలిగి ఉంది. ఫ్రంట్-యాక్సిల్‌లో ఎలక్ట్రిక్ మోటార్‌తో ఎకో, ప్లస్ వేరియంట్లలో లభిస్తుంది. ఎకో వేరియంట్ 178 bhp పవర్, 250 Nm టార్క్‌ను అందిస్తుంది. ప్లస్ వేరియంట్ విషయానికొస్తే 204bhp పవర్, 310Nm టార్క్‌ను అందిస్తుంది. ఎకో వేరియంట్ 399 కి.మీ, ప్లస్ వేరియంట్ 381 కి.మీ వరకు ప్రయాణిస్తాయి. భారతదేశంలో రిలీజ్ అయ్యే VF6 గురించి ఇంకా సమాచారం లేదు. దాదాపుగా కాన్ఫిగరేషన్ ఇదే విధంగా ఉంటుందని సమాచారం. 

44

వింఫాస్ట్ VF7

VF7 మోడల్ ఒక ఎలక్ట్రిక్ కూపే SUV. ఇది కూడా ఎకో, ప్లస్ వేరియంట్లలో లభిస్తుంది. VF6 కంటే ఇందులో 75.3 kWh బ్యాటరీ ఉంది. ఎకో వేరియంట్‌లో సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంది. ఇది 204bhp పవర్, 310Nm టార్క్‌ను అందిస్తుంది.

ప్లస్ వేరియంట్‌లో డ్యూయల్ మోటార్ ఉంది. ఇది 354bhp పవర్, 500Nm టార్క్‌ను అందిస్తుంది. VF7 ఎకో వేరియంట్ ను పూర్తిగా ఛార్జ్‌ చేస్తే 450 కి.మీ, ప్లస్ వేరియంట్ 431 కి.మీ వరకు వెళ్తుందని కంపెనీ చెబుతోంది. వింఫాస్ట్ సంస్థ తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో తమ ఉత్పత్తి కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తోంది.

click me!

Recommended Stories