Business Idea: టమాటలను ఇలా అమ్మితే, ఈ పంట పండినట్లే.. ట్రెండీ బిజినెస్‌ ఐడియా, భారీగా ఆదాయం

Published : Feb 05, 2025, 04:33 PM IST

మార్కెట్‌ అవసరాలు మారుతున్నాయి. వినియోగదారుల అభిరుచుల్లో మార్పులు వస్తున్నాయి. దీంతో కొంగొత్త వ్యాపారాలు పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా యువత ఇలాంటి అవకాశాలను ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. మార్కెట్లో ఉన్న ట్రెండీ బిజినెస్‌లను మొదలు పెట్టి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. అలాంటి ఒక బెస్ట్‌ బిజినెస్‌ ఐడియా గురించి ఈరోజు తెలుసుకుందాం..   

PREV
14
Business Idea: టమాటలను ఇలా అమ్మితే, ఈ పంట పండినట్లే.. ట్రెండీ బిజినెస్‌ ఐడియా, భారీగా ఆదాయం
tomato powder business

మార్కెట్‌కు వెళ్లిన ప్రతీ ఒక్కరూ కచ్చితంగా టమాటను కొనుగోలు చేస్తుంటారు. ఏ వంటకం పూర్తి చేయాలన్నా టమాటను ఉపయోగించాల్సిందే. దీంతో టమాట ధరల విషయంలో ప్రతీ ఒక్కరూ దృష్టిసారిస్తుంటారు. రూపాయికి కిలో టమాట ధర పలికిన రోజులు ఉంటాయి, అదే కిలో టమాట ధర రూ. 60కి చేరిన రోజులు ఉంటాయి. అలా అని టమాట తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ కొనుగోలు చేసి స్టోర్ చేయలేని పరిస్థితి ఉంటుంది. 

24
tomato powder business

ఇదిగో ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకే టమాట పౌడర్‌ ఉపయోగపడుతుంది. సూపర్‌ మార్కెట్ కల్చర్‌ చిన్న చిన్న పట్టణాలకు కూడా విస్తరించిన తర్వాత టమాట పౌడర్‌ వినియోగం పెరుగుతోంది. రెస్టారెంట్స్‌, హోటల్స్‌తో పాటు ఇళ్లలోనూ టమాట పౌడర్‌ను ఉపయోగిస్తున్న వారి సంఖ్య క్రమంగా ఎక్కువవుతోంది. దీంతో దీనికి మంచి డిమాండ్‌ ఏర్పడుతోంది. ఇలాంటి టమాట పౌడర్‌ తయారీని మీరే ప్రారంభించి లాభాలు ఆర్జిస్తే ఎలా ఉంటుంది.? ఇంతకీ ఈ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి.? ఎంత ఖర్చవుతుంది. 
 

34
tomato powder business

టమాట పౌడర్‌ తయారీ బిజినెస్‌ను చాలా తక్కువ పెట్టుబడితో మొదలు పెట్టొచ్చు. ధరలు తక్కువగా ఉన్న సమయంలో పెద్ద ఎత్తున టమాటలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. టమాటలను కొనుగోలు చేసిన తర్వాత వాటిని శుభ్రంగా కడగాలి. అనంతరం వాటిని చిన్నచిన్న ముక్కలుగా చేసి ఎండలో ఆరబెట్టాలి. ఆ తర్వాత ఎండిన టమాటలను మిక్స్‌ చేయాలి. వ్యాపారం ప్రారంభ సమయంలో ఇంట్లోనే చిన్న మిక్సీతో మొదలు పెట్టొచ్చు. 
 

44
tomato powder business

ఒకవేళ పెద్ద మొత్తంలో వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటే పెద్ద పెద్ద మిక్సీలను కొనుగోలు చేయొచ్చు. ఈ పౌడర్‌ తయారు చేసిన తర్వాత వాటిని మీ సొంత బ్రాండింగ్‌తో ప్యాకింగ్ చేయాలి. వీటిని మీకు దగ్గరల్లో ఉన్న కిరాణ దుకాణాలు, సూపర్ మార్కెట్స్‌లో, ఆన్‌లైన్‌లోకూడా విక్రయించవచ్చు. లాభాల విసయానికొస్తే.. ప్రస్తుతం మార్కెట్లో కిలో టమాట పౌడర్‌ ధర రూ. 150 వరకు ఉంది. హోల్‌సేల్‌లో కిలో పౌడర్‌ను తక్కువలో తక్కువ రూ. 80 నుంచి రూ. 100కి విక్రయించుకోవచ్చు. ఈ లెక్కన ఈ వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా భారీగా లాభాలు ఆర్జించవచ్చు. 

click me!

Recommended Stories