ఈ విమానంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జెండా అండ్ అధ్యక్షుడి ముద్ర స్పష్టంగా కనిపిస్తాయి. ఎయిర్ ఫోర్స్ వన్ లేటెస్ట్ అండ్ సురక్షితమైన కమ్యూనికేషన్ డివైజెస్ ఉంది. ఈ విమానం పాతదానికి కొద్దిగా భిన్నంగా ఉంటుంది.
ఎయిర్ ఫోర్స్ వన్ అద్భుతమైన ఏర్పాటు
ఎయిర్ ఫోర్స్ వన్‌లో నాలుగు వేల చదరపు అడుగుల అంతస్తు ఉంది. ఈ విమానంలో రాష్ట్రపతి కోసం అద్భుతమైన సూట్ కూడా ఉంది, ఇందులో పెద్ద ఆఫీస్, మీటింగ్ రూం , విలాసవంతమైన టాయిలెట్లు ఉన్నాయి. మెడికల్ సూట్, వంటగది కూడా ఏర్పాటు చేసారు. అందులో ఎప్పుడూ వంటవాళ్లు, అలాగే డాక్టర్లు ఉంటారు. వంటగదిలో ఒకేసారి 100 మందికి హాయిగా ఆహారం అందించడానికి సరిపడా మెటీరియల్ అందుబాటులో ఉంటుంది.
మీటింగ్ రూం
ఎయిర్ ఫోర్స్ వన్‌లో మీటింగ్ రూం కూడా ఉంది. అందులో ప్రెస్ బ్రీఫింగ్ రూమ్ కూడా ఉంది. అకస్మాత్తుగా గది ఏదైనా సమావేశానికి సిద్ధంగా ఉంటుంది.
అధికారులకు రూం
రాష్ట్రపతితో నివసించే అధికారులకు ప్రత్యేక గదులు కూడా ఉన్నాయి. వీరిలో సీనియర్ సలహాదారులు, గూఢచార సేవా అధికారులు, ట్రావెలింగ్ మీడియా ఇతర అతిథులు ఉంటారు. ఎయిర్ ఫోర్స్ వన్‌లో విలాసవంతమైన వెయిటింగ్ రూమ్ కూడా ఉంది.