గురువారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. US డాలర్ బలంగా పుంజుకోవడంతో విలువైన లోహాలు కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. బంగారాన్ని 12 నెలల కనిష్ట స్థాయిని తాకింది. US వినియోగదారు ధరల సూచిక డేటా, ద్రవ్యోల్బణం డేటా కూడా పసిడి ధరలను ప్రభావితం చేసింది. MCXలో, బంగారం ఫ్యూచర్స్ కేవలం 0.06 శాతం లేదా రూ. 31 పెరిగి 10 గ్రాములకు రూ. 50,675 వద్ద ట్రేడవుతున్నాయి. అయితే, వెండి ఫ్యూచర్స్ 0.30 శాతం లేదా రూ.172 తగ్గి కిలో రూ.56,753 వద్ద ట్రేడవుతున్నాయి.