7 Seater Cars: ఫ్యామిలీస్ కోసం బెస్ట్ 7 సీటర్ కార్లు వచ్చేస్తున్నాయ్

Published : Feb 20, 2025, 10:00 AM IST

7 Seater Cars: మీ ఫ్యామిలీకి తగిన 7 సీటర్ కారు కోసం చూస్తున్నారా? కాని ప్రస్తుతం మార్కెట్ లో ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా.. త్వరలోనే టొయోటా, మారుతి, కియా, రెనాల్ట్, నిస్సాన్ కంపెనీలు కొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ 7 సీటర్ కార్లను ఇండియా మార్కెట్లోకి తీసుకురానున్నాయి. ఇందులో హైబ్రిడ్, ఎలక్ట్రిక్ మోడల్స్ కూడా ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు చూద్దాం రండి. 

PREV
15
7 Seater Cars: ఫ్యామిలీస్ కోసం బెస్ట్ 7 సీటర్ కార్లు వచ్చేస్తున్నాయ్

ఫ్యామిలీ ప్రయాణించాలంటే ఎంపీవీ(Multi purpose vehicles) కార్లే సౌకర్యవంతంగా ఉంటాయి. వీటన్నింటిలోనూ 7 సీట్లతో పాటు, విశాలమైన క్యాబిన్ ఉంటుంది. అందువల్ల చాలామందికి ఈ తరహా కార్లను ఇష్టపడతారు. ప్రస్తుతానికి ఎంపీవీ కార్లలో టొయోటా ఇన్నోవా, మారుతి ఎర్టిగా మాత్రమే బెస్ట్ కార్లుగా ఉన్నాయి. 

అయితే వీటి ధరలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. అందువల్ల మిడిల్ క్లాస్ వాళ్లు, సామాన్యులు వీటిని కొనడానికి వెనుకాడతారు. మీ బడ్జెట్ తక్కువగా ఉంటే కంగారు పడకండి. త్వరలో కొత్త బడ్జెట్ కార్లు మార్కెట్ లోకి వస్తున్నాయి. ఆ కార్ల వివరాలు ఇవిగో..

25

మారుతి మినీ ఎంపీవీ

మారుతి సుజుకి ఒక కొత్త మినీ ఎంపీవీని ఇండియాలో లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. కొత్త మారుతి కార్లు హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో వస్తాయని కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు. మారుతీ మినీ ఎంపీవీ కారు ఈ ఏడాది మధ్యలో విడుదల అవుతుందని తెలిపారు. స్టైలిక్ లుక్ తో ఉన్న ఈ కారు పెద్ద ఫ్యామిలీస్ కి చాలా బాగుంటుంది.

35

కియా కేరెన్స్ ఫేస్‌లిఫ్ట్/కేరెన్స్ EV

కియా కేరెన్స్ ఫేస్‌లిఫ్ట్ 2025లో విడుదలయ్యే అవకాశం ఉంది. దీనిలో అప్‌గ్రేడ్ చేసిన హెడ్‌ల్యాంప్‌లు ఉంటాయి. ఇంజిన్‌లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. 

2025 కియా కేరెన్స్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌లతో వస్తుంది. దీనికి ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ కూడా వచ్చే అవకాశం ఉంది.

45

రెనాల్ట్ ట్రైబర్ EV

ఈ ఏడాది చివర్లో గాని, 2026 ప్రారంభంలో గాని రెనాల్ట్ కంపెనీ ఇండియాలో ట్రైబర్ కారును రిలీజ్ చేయనుంది. ఇప్పటికే ఉన్న ట్రైబర్ మోడల్ కి ఒక పెద్ద అప్‌డేట్‌ ఇస్తూ దీన్ని రిలీజ్ చేస్తారు. అది కచ్చితంగా ఫ్రంట్ లుక్ మారుతుందని సమాచారం. అయితే ఇంజిన్ లో మాత్రం ఎలాంటి మార్పులు ఉండవు. ధర బడ్జెట్ లోనే ఉంటుదట.

55

నిస్సాన్ ఎలక్ట్రిక్ కారు

నిస్సాన్ కంపెనీ కూడా ఇండియా మార్కెట్ కు సరిపోయే ఒక ఎంట్రీ లెవెల్ ఎంపీవీని ప్లాన్ చేస్తోంది. ఇది రెనాల్ట్ ట్రైబర్ ఫీచర్స్ ఆధారంగా ఉంటుందని సమాచారం. దీనిలో 71 బీహెచ్‌పీ పవర్ ఉంటుంది.

ఈ కార్లన్నీ ఫ్యామిలీ మెన్ బడ్జెట్ లో లభించేలా కంపెనీలు ప్లాన్ చేస్తున్నాయి. అందువల్ల కొన్ని రోజులు ఆగితే తక్కువ బడ్జెట్ లో మంచి ఫ్యామిలీ కారును మీరు కొనుగోలు చేయొచ్చు.  

click me!

Recommended Stories