అలెర్ట్: సెప్టెంబర్ 1 నుండి పి‌ఎఫ్ ఖాతాల రూల్స్ మార్పు.. ఈ ముఖ్యమైన నియమాలు తెలుసుకోండి..

First Published Aug 24, 2021, 2:45 PM IST

కరోనా వ్యాప్తి సమయంలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో ఎంతో మంది  ప్రావిడెంట్ ఫండ్ (పిఎఫ్) డబ్బును కూడా ఉపసంహరించుకోవలసి వచ్చింది. కానీ కొంతమందికి ఇప్పటికీ వారి పి‌ఎఫ్ ఖాతా గురించి సమాచారం లేదు. 

ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈ‌పి‌ఎఫ్‌ఓ)  ఖాతాదారుల కోసం నియమాలలో కొన్ని మార్పులు చేసింది. మీరు ఈ మార్పులను ముందుగా తెలుసుకోవాలి ఎందుకంటే  ఈ రూల్స్  మీపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపవచ్చు.  

 ఈ‌పి‌ఎఫ్‌ఓ కొత్త నిబంధనల ప్రకారం ప్రతిఒక్క పి‌ఎఫ్ ఖాతాదారుడు వారి పి‌ఎఫ్ ఖాతాను ఆధార్ కార్డుతో లింక్ చేయడం తప్పనిసరి. ఈ నియమం 1 సెప్టెంబర్  2021 నుండి అమలులోకి వస్తుంది. గతంలో అంటే జూన్ 1న ఈ రూల్ అమలులోకి రావాల్సి ఉంది కానీ అప్పుడు  దాని గడువు పెంచారు. అంటే మీరు ఆగస్టు 31 లోపు మీ పి‌ఎఫ్ ఖాతాను ఆధార్ కార్డుతో లింక్ చేయాలి. మీ ఖాతాను ఆధార్‌తో లింక్ చేయకపోతే పి‌ఎఫ్ ఖాతాకు చేరే సహకారం నిలిచిపోతుంది. అలాగే ఎలక్ట్రానిక్ చలాన్ అండ్ రిటర్న్ (ECR)నింపలేరు. సోషల్ సెక్యూరిటి కోడ్ 2020 కింద ఆధార్‌ని పి‌ఎఫ్ ఖాతాతో లింక్ చేయాలని ఈ‌పి‌ఎఫ్‌ఓ ఈ ​​నిర్ణయం తీసుకుంది. 

ఈ‌పి‌ఎఫ్‌ఓ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా మీరు మీ ఖాతాను ఆధార్‌తో లింక్ చేయవచ్చు. 
ఇందుకు ముందుగా మీరు ఈ‌పి‌ఎఫ్‌ఓ ​​వెబ్‌సైట్‌కి వెళ్ళాలి తరువాత కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయండి.
https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/

ఇప్పుడు మీ యూ‌ఏ‌ఎన్ అండ్ పాస్‌వర్డ్‌తో మీ పి‌ఎఫ్ ఖాతాకు లాగిన్ అవ్వాలి.

ఇప్పుడు 'మేనేజ్' విభాగంలో కే‌వై‌సి ఎంపికపై క్లిక్ చేయండి.
ఇక్కడ మీ ముందు ఓపెన్ అయిన పేజీలో మీ ఈ‌పి‌ఎఫ్ ఖాతాతో లింక్ చేయడానికి కొన్ని  డాక్యుమెంట్స్  చూస్తారు.
ఇక్కడ ఆధార్ ఆప్షన్ ఎంచుకుని ఆధార్ కార్డుపై ఉన్న మీ ఆధార్ నంబర్, మీ పేరును టైప్ చేసి సర్వీస్‌పై క్లిక్ చేయండి.
దీని తర్వాత మీరు ఇచ్చిన సమాచారం సేవ్ అవుతుంది, మీ ఆధార్ యూ‌ఐ‌డి‌ఏ‌ఐ డేటాతో వేరిఫై అవుతుంది.
ఒక్కసారి మీ కే‌వై‌సి డాక్యుమెంట్స్  వేరిఫై తర్వాత మీ ఆధార్ కార్డ్ మీ పి‌ఎఫ్ ఖాతాతో లింక్ అవుతుంది. మీ ఆధార్ సమాచారం ముందు వేరిఫైడ్ అని చూపిస్తుంది.

ఈ‌పి‌ఎఫ్ సబ్ స్క్రైబర్స్ కోవిడ్ అడ్వాన్స్‌ని సద్వినియోగం చేసుకోవచ్చు

నాన్ రీఫండబుల్  కోవిడ్ అడ్వాన్స్‌ని చందాదారులు రెండోసారి కూడా సద్వినియోగం చేసుకోవచ్చని తెలిసింది. మార్చి 2020లో  ప్రభుత్వం ఈ‌పి‌ఎఫ్ చందాదారులకు ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన (PMGKY) కింద ముందస్తు సదుపాయాన్ని ఇచ్చింది. దేశంలో కరోనా మహమ్మారి  సెకిండ్ వేవ్ నుండి  చందాదారులకు ఉపశమనం కలిగించెందుకు మే నెలలో కార్మిక మంత్రిత్వ శాఖ నాన్ రీఫండబుల్  కోవిడ్ -19 అడ్వాన్స్‌ని ఉపసంహరించుకోవడానికి అనుమతించింది, దీని కింద, మీరు మీ పి‌ఎఫ్ ఖాతాలో డిపాజిట్ చేసిన మొత్తంలో 75 శాతం లేదా మూడు నెలల వేతనానికి సమానమైన మొత్తాన్ని (బేసిక్ జీతం  అండ్ డియర్‌నెస్ అలవెన్స్) (ఏది తక్కువైనా) ఉపసంహరించుకోవచ్చు.

click me!