విజయ్‌మాల్యాకు యూకే కోర్టు భారీ షాక్‌..! ఇంటి వెంటనే ఖాళీ చేయలని ఆదేశం.. లేదంటే..

First Published Jan 19, 2022, 1:47 PM IST

న్యూఢిల్లీ :  బ్యాంక్ రుణాల ఎగవేత కేసులో పరారీలో ఉన్న ఆర్థికవేత్త విజయ్ మాల్యా(vijay mallya)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది.  తాజాగా బ్రిటన్ కోర్టు (britan court)మంగళవారం జనవరి 18న లండన్ లోని  విజయ్ మాల్యా ఖరీదైన ఇంటి ఖాళీ చేయమని ఆదేశించింది.
 

విజయ్ మాల్యా అతని కుటుంబం-కొడుకు సిద్ధార్థ ఇంకా తల్లి లలిత  ఈ ఇంటిలో నివసిస్తున్నారు.లండన్‌లోని రీజెంట్స్ పార్క్‌కి ఎదురుగా ఉన్న 65 ఏళ్ల వ్యాపారవేత్త  విజయ్ మాల్యా  విలువైన ఆస్తి కార్న్‌వాల్ టెర్రేస్ అపార్ట్‌మెంట్‌ను స్విస్ బ్యాంక్ యూ‌బి‌ఎస్ స్వాధీనం చేసుకుంటుందని నివేదించబడింది.

దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ‌ వివాదంలో  హైకోర్టు న్యాయమూర్తి డిప్యూటీ మాస్టర్ మాథ్యూ మార్ష్  తీర్పును వెలువరిస్తూ యూ‌బి‌ఎస్ కి 20.4-మిలియన్ పౌండ్ల  అంటే సుమారు రూ. 185.4 కోట్ల రుణాన్ని తిరిగి చెల్లించడానికి విజయ్ మాల్యా కుటుంబానికి మరింత సరిపడ సమయం కల్పించాం. ఐనప్పటికీ అప్పులు చెల్లించడంలో ఆయన విఫలమయ్యారు.   

మరీ ముఖ్యంగా కోర్ట్ ఉత్తర్వుపై  విజయ్ మాల్యాకి రి- అప్పీల్ చేయడానికి లేదా తాత్కాలిక స్టే ఇవ్వడానికి అనుమతిని తిరస్కరించారు. 

బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్‌లో 2012లో మాల్యా ఫ్యామిలీ ట్రస్ట్ యాజమాన్యంలోని రోజ్ క్యాపిటల్ వెంచర్స్ 20.4 మిలియన్ పౌండ్ల రుణం కోసం ఐదేళ్లపాటు ఈ ప్రాపర్టీని యూబీఎస్‌కు తనఖా(mortgaged) పెట్టింది. 2017లో రుణం గడువు ముగిసీన బకాయిలు చెల్లించలేదు.

ఇదిలా ఉండగా విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ వంటి పరారీలో ఉన్న వారి ఆస్తుల విక్రయం నుండి రుణదాతలు(banks) రూ. 13,109.17 కోట్లను రికవరీ చేశాయని గత నెల చివర్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

2019లో ముంబై కోర్టు విజయ్ మాల్యాను పారిపోయిన ఆర్థిక నేరస్థుడిగా (FEO) ప్రకటించింది ఇంకా పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల చట్టం కింద ఎఫ్‌ఈ‌ఓగా ప్రకటించిన మొదటి వ్యాపారవేత్తగా నిలిచాడు.


విజయ్ మాల్యా మార్చి 2016లో భారత్‌ను విడిచిపెట్టారు, 13 ప్రభుత్వ రంగ బ్యాంకుల కన్సార్టియంకు దాదాపు రూ.9,000 కోట్లు చెల్లించాల్సి ఉంది.  
 

click me!