కొత్త ఏడాదిలో ఉద్యోగులు కోరుకునేది ఎక్కువగా ఇదేనట.. తాజా సర్వే లో వెల్లడి..

First Published Jan 18, 2022, 7:28 PM IST

కొత్త సంవత్సరం 2022 కొత్త అవకాశాలతో ప్రారంభమైంది. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం చాలా ప్రత్యేకమైనది. కరోనా మహమ్మారి (corona pandamic)ఉన్నప్పటికీ భారతదేశ శ్రామిక శక్తి  భవిష్యత్తు గురించి చాలా ఆశాజనకంగా ఉందని అలాగే 82 శాతం మంది నిపుణులు తమ ఉద్యోగాలను మార్చుకోవాలని ఆలోచిస్తున్నారని ఇటీవలి సర్వే (survey)వెల్లడించింది.

1,111 మంది నిపుణులు
ఈ సర్వేను లింక్డ్‌ఇన్ నిర్వహించింది. అయితే ఈ సర్వే ఆధారంగా విడుదల చేసిన నివేదిక ప్రకారం, ఈ ఏడాది జాబ్ మార్కెట్‌లో పెద్ద మార్పు కనిపించనుంది. ఉద్యోగాలు మారాలనుకునే వారిలో ఫ్రెషర్స్ నుండి అనుభవజ్ఞులైన నిపుణుల వరకు ఉన్నారు. దేశవ్యాప్తంగా 1,111 మంది నిపుణుల అభిప్రాయాలను ఈ సర్వేలో పొందుపరిచారు ఇంకా దీని ఆధారంగా ఒక వివరణాత్మక నివేదికను తయారు చేసి విడుదల చేశారు. 
 

మంచి వర్క్ కల్చర్ 
అయితే 30 శాతం మంది వర్క్ లైఫ్ లో  బ్యాలెన్స్ సరిగా లేకపోవడం, 28 శాతం మంది ఆదాయం సరిపోకపోవడం, 23 శాతం మంది కెరీర్ వృద్ధి కోసం కొత్త ఉద్యోగం కోసం  ప్రస్తుత ఉద్యోగాన్ని వదిలివేయాలని ఆలోచిస్తున్నట్లు సర్వే వెల్లడించింది. కొత్త సంవత్సరంలో కొత్త ఉద్యోగాల కోసం వెతుకుతున్నప్పుడు, మంచి వర్క్ కల్చర్  కలిగి ఉండటమే తమ ప్రధాన ప్రాధాన్యత అని భారతీయ నిపుణులు అంటున్నారు. 
 

పనితీరు పై  ప్రశ్న
దాదాపు 94 శాతం మంది ఫ్రెషర్లు 2022లో ఉద్యోగాలు మారాలని కోరుకుంటున్నారని, 87 శాతం మంది జనరేషన్ జెడ్ నిపుణులు ఉద్యోగాలను మార్చాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఈ సర్వే ప్రకారం, 71 శాతం మంది నిపుణులు తమ పని సామర్థ్యం కరోనా మహమ్మారి ముందు కంటే ఇప్పుడు ఎక్కువగా ప్రశ్నించబడుతున్నారని చెప్పారు. అందుకే ఉద్యోగాలు మారాలని నిర్ణయం తీసుకున్నారు. 63 శాతం మంది ప్రజలు తమ ఉద్యోగం కారణంగా ఇంపోస్టర్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నారని చెప్పారు. 

కరోనా మహమ్మారి కారణంగా విశ్వాసంపై ప్రభావం
30 శాతం మంది నిపుణులు కరోనా తమ ఆత్మవిశ్వాసాన్ని ప్రభావితం చేసిందని ఇంకా ఆత్మవిశ్వాసంపై చెడు ప్రభావాన్ని చూపుతుందని నమ్ముతున్నారు. 40 శాతం మంది తమ సహోద్యోగులు లేదా కార్యాలయంలోని టీమ్ లీడర్‌ల నుండి మద్దతు లేకపోవడం వల్ల కలత చెందుతున్నారు. 34 శాతం మంది ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు చేపట్టడం సుఖంగా లేరు. ఈ సర్వేలో వెల్లడైన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. కొత్త టెక్నాలజీలతో తమను తాము సర్దుబాటు చేసుకోలేక ఉద్యోగాలు మారాలని కోరుకునే వారిలో 31 శాతం మంది నిపుణులు ఉన్నారు. 

click me!