ఈ ప్రమాదం అతని క్రికెట్ కెరీర్‌ను ముగించడమే కాకుండా జమ్నాలాల్ బజాజ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో ఒక సంవత్సరం కూడా కోల్పోయారు.
తన MBA పూర్తి చేసిన తర్వాత అతను కుటుంబం, స్నేహితుల పెట్టుబడి సహకారంతో ఫైనాన్స్ అండ్ బిల్ డిస్కౌంటింగ్ బిజినెస్ ప్రారంభించాడు. ఈ పెట్టుబడిలో ఎక్కువ భాగం అతని ప్రాణ స్నేహితుడు ఆనంద్ మహీంద్రా నుండి వచ్చింది.
తరువాత కొన్ని సంవత్సరాలలో ఉదయ్ కోటక్ ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ వ్యాపారాన్ని వివిధ ఆర్థిక సేవల రంగాలలోకి విస్తరించాడు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, బిల్ డిస్కౌంటింగ్, స్టాక్ బ్రోకింగ్, మ్యూచువల్ ఫండ్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ఇంకా కార్ ఫైనాన్స్‌లో ఉనికిని ఏర్పరచుకున్నాడు.