Business Ideas: కేవలం రూ.70 వేల పెట్టుబడితో నెలకు రూ. 50వేలు సంపాదించే అవకాశం..న్యూ బిజినెస్ ఐడియా

First Published Nov 11, 2022, 12:51 PM IST

చిన్న పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటున్నారా అయితే బనానా చిప్స్ సరైన ఎంపిక అవుతుంది.  అవును మీరు విన్నది నిజమే. బనానా చిప్స్ ప్రస్తుతం చక్కటి డిమాండ్ ఉంది. తద్వారా మీరు తక్కువ పెట్టుబడితోనే మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. 

Image: Getty Images

బనానా చిప్స్ తయారీ వ్యాపారం లాభదాయకమైన వ్యాపారం. ఇప్పటి వరకు చిన్న కంపెనీలు మాత్రమే అరటిపండు చిప్స్ తయారు చేసి విక్రయిస్తున్నాయి. ప్రస్తుతం ఈ రంగంలో పెద్దగా పోటీ లేదు. ప్రతిచోటా అరటిపండు చిప్స్‌కు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. అందువల్ల, మీ ఉత్పత్తిని మార్కెట్లో విక్రయించడంలో మీరు ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు.

విశేషమేమిటంటే అరటిపండు చిప్‌ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి పెద్దగా ఖర్చు చేయనవసరం లేదు. మీరు దీన్ని ప్రారంభంలో చాలా చిన్న స్థాయి నుండి ప్రారంభించవచ్చు. పండుగల వేళ వీటికి చాలా గిరాకీ ఉంటుంది. కాబట్టి మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభిస్తే మంచి లాభాలు పొందవచ్చు.

అరటిపండు చిప్స్ తయారు చేయడానికి ఒక యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి, మీకు 500 చదరపు గజాల స్థలం ఉండాలి. చిప్స్ తయారు చేయడానికి కొన్ని ప్రత్యేక యంత్రాలు అవసరం. దీన్ని తయారు చేయడానికి, అరటిపండ్లను కడగడానికి ఒక ట్యాంక్  అరటిపండ్లను తొక్కతీయడానికి ఒక యంత్రాన్ని కొనుగోలు చేయాలి. అంతే కాకుండా అరటిపండ్లను చిప్స్ రూపంలో కోసి, వేయించి, అందులో మసాలాలు కలపడానికి ఒక యంత్రం అవసరం అవుతుంది. మీరు ప్యాకింగ్ కోసం ప్యాకేజింగ్ యంత్రాన్ని కూడా కొనుగోలు చేయాలి.
 

ఈ యంత్రాలు సులభంగా అందుబాటులో ఉన్నాయి. మీరు వాటిని ఆన్‌లైన్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు. దీని కోసం, మీరు ఇండియా మార్ట్ లేదా ఈ కామర్స్ వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయవచ్చు. యంత్రాన్ని కొనుగోలు చేసే ముందు, క్వాలిటీని క్షుణ్ణంగా పరిశీలించాలి. ప్రారంభంలో, మీరు చిన్న యంత్రాలను కొనుగోలు చేయడం ద్వారా మీ పనిని ప్రారంభించవచ్చు. ఈ యంత్రాల కోసం దాదాపు 70 వేల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. చిప్స్ తయారీకి ముడి అరటిపండు, నూనె  చిప్స్‌లో ఉపయోగించే మసాలాలు అవసరం. మీరు ప్యాకింగ్ కోసం ప్యాకేజింగ్ మెటీరియల్‌ను కూడా కొనుగోలు చేయాలి.
 

50 కిలోల చిప్స్ తయారీ ఖర్చు
50 కిలోల చిప్స్‌ తయారు చేసేందుకు కనీసం రూ.1000 విలువ చేసే అరటిపళ్లు, రూ.1000లకే వంటనూనె, చిప్స్‌ ఫ్రైయర్‌ మిషన్‌ను నడపడానికి కరెంటు, దాదాపు రూ.200 విలువైన మసాలా దినుసులు కావాలి. ఇలా చేస్తే 50 కిలోల చిప్స్ రూ.2200కి రెడీ అవుతుంది.

ఎంత సంపాదించవచ్చు..
ఒక కేజీ చిప్స్ ప్యాకెట్ ప్యాకింగ్ ఖర్చులతో కలిపి రూ.70 అవుతుంది. మీరు దానిని కిలో 90-100 రూపాయలకు సులభంగా అమ్మవచ్చు. కిలోకు రూ.20 లాభం వచ్చి, రోజూ 50 కిలోల చిప్స్ అమ్మగలిగితే, రోజూ వెయ్యి రూపాయల లాభం పొందవచ్చు. మీ ఉత్పత్తి వినియోగం పెరుగుతున్న కొద్దీ, మీ ఆదాయాలు కూడా పెరుగుతాయి.
 

click me!