టీవీఎస్ నుంచి రానున్న కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి TVS మోటార్ డైరెక్టర్, CEO కె.ఎన్. రాధాకృష్ణన్ మాట్లాడుతూ, “మేము బాగా ప్రణాళికాబద్ధమైన ఎలక్ట్రిక్ మొబిలిటీ ఉత్పత్తి శ్రేణిని కలిగి ఉన్నాం. అందువల్లనే మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా ప్రోడక్ట్స్ తీసుకొస్తున్నాం. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు మరిన్ని ప్రోడక్ట్ లాంఛ్ లను మీరు చూస్తారు. మా లక్ష్యాలను పూర్తి చేసే విధంగా కొత్త ఉత్పత్తులను రూపొందిస్తున్నాం. ఒక కొత్త కస్టమర్ సెగ్మెంట్, ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి వస్తుంది.’’ అన్నారు.
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ఆమోదానికి నిబంధనలు కఠినంగా ఉన్నప్పటికీ ఈ రంగంలో గణనీయమైన వృద్ధి సాధ్యమవుతుందని వాహన తయారీదారులు విశ్వసిస్తున్నారు. అందుకే మరిన్ని ప్రోడక్ట్స్ తీసుకురావడానికి వివిధ రకాల కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.