లాక్ డౌన్ తర్వాత కూడా రికార్డ్ బ్రేకింగ్ బిజినెస్.. కరోనా కాలంలో భారీగా వాటి అమ్మకాలు..

First Published Jun 19, 2021, 1:07 PM IST

దేశవ్యాప్తంగా కరోనా లాక్ డౌన్ తర్వాత  కూడా ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ వ్యాపారం ఈ సంవత్సరం రికార్డ్ బ్రేక్ చేసింది. ఖాదీ ఇ-పోర్టల్ ద్వారా ప్రజలు ఎక్కువగా ఖాదీ మాస్కూలు, ఖాదీ పాదరక్షలు, ఖాదీ నేచురల్ పెయింట్స్, ఖాదీ హ్యాండ్ శానిటైజర్స్ మొదలైనవాటిని  భారీగా కొనుగోలు చేశారు.

2020-21 సంవత్సరంలో ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ గ్రాస్ వార్షిక టర్నోవర్‌ను రూ .95,741.74 కోట్లుగా నమోదైంది. గత 2019-20లో ఖాదీ వ్యాపారం రూ .88,887 కోట్లగా నమోదైంది. అంటే గత సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది ఖాదీ వ్యాపారంలో 7.71 శాతం వృద్ధిని నమోదు చేసింది.
undefined
గత ఏడాది మార్చి 25న దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా ఉత్పత్తి కార్యకలాపాలు మూడు నెలలకు పైగా నిలిచిపోవడంతో 2020-21లో ఖాదీ విలేజ్ కమిషన్ రికార్డు పనితీరు ప్రాముఖ్యతను సంతరించుకుంది. కరోనా సమయంలో అన్ని ఖాదీ ఉత్పత్తి యూనిట్లు, అమ్మకపు దుకాణాలు కూడా మూసివేయబడ్డాయి, ఈ కారణంగా ఉత్పత్తి, అమ్మకాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అయితే, 'సెల్ఫ్ రిలయంట్ ఇండియా' అండ్ 'లోకల్ ఫర్ వొకల్' ప్రధాన మంత్రి పిలుపుపై ​​ఖాదీ కమిషన్ వేగంగా ఊపందుకుంది. అలాగే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రి నితిన్ గడ్కరీ ప్రత్యేకమైన మార్కెటింగ్ ఆలోచన ఫలితంగా ఖాదీ తన ఉత్పత్తులకు కొత్త వెరైటీలు తీసుకొచ్చింది. దీంతో స్థానిక ఉత్పత్తులకు డిమాండ్ కూడా భారీగా పెరిగింది.
undefined
కరోనా మహమ్మారి సమయంలో ప్రజలు 'సెల్ఫ్ రిలయంట్ ఇండియా' అండ్ 'లోకల్ ఫర్ వొకల్' పిలుపును పూర్తి ఉత్సాహంతో నెరవేర్చారని కెవిఐసి అధ్యక్షుడు వినయ్ కుమార్ సక్సేనా అన్నారు. కరోనా కాలంలో కెవిఐసి ప్రధాన దృష్టి ఏంటంటే చేతివృత్తులవారికి, నిరుద్యోగ యువతకు శాశ్వత ఉపాధి కల్పించడం. ఆర్థిక సంక్షోభాన్ని ఎదురుకొంటున్న యువకులు పిఎమ్‌ఇజిపి కింద స్వయం ఉపాధి, ఉత్పాదక కార్యకలాపాలను చేపట్టారు, ఇది గ్రామ పరిశ్రమల రంగంలో ఉత్పత్తిని పెంచింది. అలాగే దేశీయ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రధాని విజ్ఞప్తి చేసిన తరువాత ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ ఉత్పత్తులు అమ్మకాలు వేగంగా పెరిగాయి.
undefined
2019-20లో ఖాదీ పొందిన లాభం రూ .65,393.40 కోట్లతో పోలిస్తే 2020-21లో విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ద్వారా రూ .70,329.67 కోట్లు సంపాదించింది. అదేవిధంగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో విలేజ్ ఇండస్ట్రీస్ ఉత్పత్తుల అమ్మకాలు రూ .92,214.03 కోట్లు కాగా, 2019-20లో రూ.84,675 కోట్లుగా ఉంది.
undefined
ఖాదీ అమ్మకాలు క్షీణించాయికరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా స్పిన్నింగ్, చేనేత కార్యకలాపాలు నిలిచిపోవడంతో ఖాదీ రంగంలో ఉత్పత్తి, అమ్మకాలు కొద్దిగా తగ్గాయి. 2020-21లో ఖాదీ రంగంలో మొత్తం ఉత్పత్తి 1904.49 కోట్లు కాగా, 2019-20లో 2292.44 కోట్లు. 2020-21లో మొత్తం ఖాదీ అమ్మకాలు రూ .3527.71 కోట్లు, అంతకుముందు సంవత్సరంలో రూ .14,211.26 కోట్లు.
undefined
click me!