ఒకప్పుడు రూ.150కు హోటల్ వర్కర్.. నేడు రూ.1.5 కోట్ల కారు ఓనర్.. ఇతని లైఫ్ స్టోరీ వింటే..

First Published Jun 18, 2021, 7:02 PM IST

జీవితంలో ఇబ్బందులు, చింతలు లేని వారు ఉండరు. కానీ మనకు లభించే కొన్ని అవకాశాలు చీకటిలో ఉన్న మనల్ని  సక్సెస్ ఫుల్ చేస్తాయి. మనకు ఎదురయ్యే  విజయాల వెనుక సంక్షోభాలను అధిగమించే మనస్తత్వం ఉంటుంది. అయితే రాహుల్ తనేజా కథ కూడా భిన్నంగా ఉంటుంది.

ఎందుకంటే అతను ఒకప్పుడు ఒక రెస్టారెంట్‌లో రూ.150 పనిచేసిన సంధర్భం కూడా ఉంది. అయితే ప్రస్తుతం 40 ఏళ్ల రాహుల్ తనేజా తన కొత్త రూ .1.5 కోట్ల కారు నంబర్ ప్లేట్ కోసం రూ .16 లక్షలు ఖర్చు చేయటంతో 2018లో చర్చనీయాంశంగా నిలిచారు. ఒక విధంగా చెప్పాలంటే అతని జీవిత కథ ఖచ్చితంగా మీకు నమ్మశక్యం అనిపించదు !
undefined
రాహుల్ తనేజా మధ్యప్రదేశ్ లోని కట్లాలో జన్మించారు. అతని తండ్రి పంచర్‌ షాపు నడిపించేవాడు. మనస్సులో ఎన్నో కలలు కన్న రాహుల్ తనేజా తన 11వ ఏటనే ఇంటిని విడిచిపెట్టి రాజస్థాన్ లోని జైపూర్ కు వెళ్లి సొంత జీవితాన్ని ప్రారంభించాడు. తరువాత ఆదర్శ్‌నగర్‌లోని ధాబాలో పనిచేయడం కొనసాగించాడు. అప్పుడు అతనికి ఒక రోజు సెలవు కూడా ఉండేది కాదు. ఎంత పని ఉన్నప్పటికీ నెల చివరిలో అతనికి రూ.150 మాత్రమే లభించేవి. కానీ అతను ఆ పనిని వదులుకోవలని అనుకోలేదు. ఆ డబ్బు సంపాదించడంలో రాహుల్ ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు.
undefined
తన ధాబా పనితో పాటు రాజపార్క్‌లోని ఆదర్శ్ విద్యా మందిరంలో అడ్మిషన్ పొందారు. స్నేహితుల నుండి పుస్తకాలు, నోట్ బుక్లను తీసుకొని రాహుల్ తన చదువును కొనసాగించాడు, చివరికి 92 శాతం మార్కులు సాధించి ఉత్తీర్ణుడు అయ్యాడు. రెండేళ్లపాటు ధాబాలో పని చేసిన తరువాత అతను దీపావళి సందర్భంగా పటాకులు, హోలీ సమయంలో రంగులు, మకర సంక్రాంతి సమయంలో గాలిపటాలు, రాక్షంధన్ సమయంలో రాఖీలను విక్రయించడం మొదలుపెట్టాడు. కాస్త పెద్దయ్యాక కార్లు నడపడం, ఇంటి నుండి ఇంటికి ప్రతిరోజూ న్యూస్ పేపర్ వేయడం పనులు కూడా చేసేవాడు.
undefined
ఒకసారి అతని స్నేహితులు మోడలింగ్‌ చేయమని సలహా ఇచ్చారు. స్నేహితుల సూచన మేరకు రాహుల్ మోడలింగ్‌లోకి ప్రవేశించాడు. అతను అక్కడ కూడా సక్సెస్ అయ్యాడు. అతను మిస్టర్ జైపూర్, మిస్టర్ రాజస్థాన్, మెయిల్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను గెలుచుకున్నాడు. ఎనిమిది నెలల పాటు ఫ్యాషన్ షోలకు హాజరైన తరువాత ఫ్యాషన్ షోలను ఎలా నిర్వహించాలో నేర్చుకోవడం ప్రారంభించాడు. అతను ఫ్యాషన్ షో కార్యక్రమాలని నిర్వహించడంలో అనుభవాన్ని పొందాడు. స్టేజ్ వెనుక కాకుండా దాని వెనుక ఉన్న విషయాలను, ఎలా ఆర్గానైజ్ చేయాలో తెలుసుకున్నాడు. ఇందుకు అతను అనేక షోలు, ఈవెంట్లు పర్యవేక్షించడం ప్రారంభించాడు. ఇదంతా అతనికి భారీ విజయాన్ని సాధించి పెట్టింది. ఇక అతను వెనక్కి తిరిగి చూడలేదు. ఈ రోజు రాహుల్ లైవ్ క్రియేషన్స్ అనే మల్టీ మిలియన్ డాలర్ల వివాహ నిర్వహణ సంస్థను సొంతంగా నడిపిస్తున్నాడు.
undefined
1 నంబర్ ఎప్పుడూ అతను నంబర్ వన్ అవ్వాలనుకునే రాహుల్ ఇష్టమైన నంబర్. అతను తన వాహనాల నంబర్ ప్లేట్లలో నంబర్ 1 ఉండటం తప్పనిసరి. అతను దానిని సొంతం చేసుకోవడానికి ఎంత డబ్బు ఖర్చు అయిన చేస్తాడు. 2011లో రాహుల్ రూ.10 లక్షల విలువైన బిఎమ్‌డబ్ల్యూ కోసం విఐపి 0001 నంబర్ ప్లేట్‌ను కొనుగోలు చేశాడు. అలాగే, అతని సెల్ ఫోన్ నంబర్లలో చివరి ఏడు అంకెలు కూడా ఒకటి.
undefined
click me!