నేషనల్ హైవేలు, కొన్ని స్టేట్ రోడ్స్ లో టోల్ ప్లాజాలు ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం పన్నులు వసూలు చేస్తుంటుంది. ఆ రోడ్లపై వెహికల్స్ లో ప్రయాణించిన జనం టోల్ టాక్స్ కట్టి వెళ్లాల్సి ఉంటుంది. ఈ టోల్ టాక్స్ లు వాహనాన్ని బట్టి మారుతూ ఉంటాయి. కార్లు, జీపులకైతే ఒకలా, బస్సులు, లారీల లాంటి పెద్ద వాహనాలకైతే ఎక్కువ టోల్ ఛార్జ్ వసూలు చేస్తారు. ఇలా వచ్చిన డబ్బుతో రోడ్లు బాగు చేస్తారు. కొత్త రోడ్లు వేస్తారు.