యూత్ ను ఆకట్టుకోవడానికి యాక్టివా ఎలక్ట్రిక్
హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త తరం కోసం ఎంపిక చేసే వాహనం. ముఖ్యంగా యువతులు కొనుగోలు చేయడానికి మొదటి ఎంపికగా ఉంటుంది. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్పీడోమీటర్, ఓడోమీటర్, ఇతర ఫీచర్లు ఈ స్కూటర్‌లో ఉంటాయని కంపెనీ ఇచ్చిన ప్రకటన ద్వారా తెలుస్తోంది. దీంతో పాటు ట్రిప్ మీటర్, మొబైల్ ఛార్జింగ్ పోర్ట్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి. మ్యూజిక్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఉండవచ్చని భావిస్తున్నారు. అదే సమయంలో ఎలక్ట్రిక్ స్కూటర్ ముందు చక్రంలో డిస్క్ బ్రేక్ ఉంటుందట. కంపెనీ ప్రకటనల ఆధారంగా 3.2 kW బ్యాటరీని ఇందులో అమరుస్తున్నారు. ఇది పూర్తిగా ఛార్జ్ చేయడానికి దాదాపు 3 గంటలు పడుతుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 150 కి.మీ వరకు ప్రయాణించవచ్చు.
యాక్టివా ఎలక్ట్రిక్ స్టైలింగ్‌కు సంబంధించి ICE వెర్షన్ మాదిరిగానే డిజైన్ లాంగ్వేజ్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. అందువల్ల ఇది LED హెడ్‌ల్యాంప్, వెడల్పాటి ఫ్రంట్ ఆప్రాన్, ఫ్లాట్ సీటు ఉంటుందని అంచనా. పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో రావచ్చు. అధిక వేరియంట్‌లు కనెక్ట్ చేయబడిన టెక్, నావిగేషన్‌తో పూర్తి టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను ఉంటుందని సమాచారం.